పేసర్ కెప్టెన్‌గా ఉండడం కష్టం.. బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వడంపై రవి శాస్త్రి షాకింగ్ కామెంట్స్

సౌతాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరనే అంశంపై పలువురి పేర్లు తెరపైకి వస్తున్నారు. టెస్ట్ కెప్టెన్ రేసులో రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ కూడా ఆ రేసులో ఉన్నారు. అయితే వీరికి తోడుగా చాలా కాలంగా టీమిండియాలో నిలకడగా రాణిస్తున్న పేస్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ పేర్లు కూడా చర్చకు వస్తున్నాయి. దీనికి తోడు కెప్టెన్సీ ఇస్తే బాధ్యతలు చేపట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని వీరిద్దరు ప్రకటించారు. దీంతో టీమిండియా టెస్ట్ కెప్టెన్సీపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ అంశంపై ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించాడు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా ఉండడం కష్టం
జస్ప్రీత్ బుమ్రాకు టీమిండియా కెప్టెన్సీ అప్పగించాలనే వాదనను రవిశాస్త్రి విభేదించాడు. బుమ్రాకు లేదా ఒక ఫాస్ట్ బౌలర్‌కు టీమిండియా కెప్టెన్సీ అప్పగించడం గురించి తానెప్పుడు ఆలోచించ లేదని తెలిపాడు. తాను హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో కూడా ఒక పేస్ బౌలర్‌కు కెప్టెన్సీ అప్పగించడం గురించి ఆలోచించలేదన్నాడు. టీమిండియాకు ఒక ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా ఉండడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చాడు. ఎందుకంటే నిజానికి టీమిండియాలో పోటీ చాలా తీవ్రంగా ఉంటుందని, దీంతో ఒక ఫాస్ట్ బౌలర్ జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగలేడని తెలిపాడు.

కపిల్‌దేవ్ లాంటి వాడై ఉండాలి
అలాగే ఫాస్ట్ బౌలర్ కెప్టెన్‌గా ఉండాలంటే అతను బ్యాట్‌తోనూ రాణించాల్సి ఉంటుందని శాస్త్రి చెప్పాడు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, సర్ గార్‌ఫీల్డ్ లాంటి ఆల్‌రౌండరై ఉండాలని తెలిపాడు. లేదంటే బాబ్ విల్లీస్‌లా ఎప్పుడూ జట్టులో ఉండగలగాలన్నాడు. దూకుడుగా ఉంటూ, ఎప్పుడూ జట్టులో ఉంటూ, నిత్యం వికెట్లు తీస్తూ ఉండాలని చెప్పాడు. నిజానికి అలాంటి పేసర్లు అరుదుగా ఉంటారని అన్నాడు. ఒక వేళ పేసర్‌కు కెప్టెన్సీ ఇచ్చిన అతను చాలా కాలంపాటు ఆ పదవిలో ఉండలేడని ఆయన అన్నాడు. చాలా అరుదుగా మాత్రమే ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ కాలం కెప్టెన్‌గా ఉంటారని రవిశాస్త్రి తెలిపాడు.

త్వరలోనే ఎంపిక
కాగా టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరనేది త్వరలోనే తేలిపోనుంది. ఇప్పటికే బీసీసీఐ ఈ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిజానికి వెస్టిండీస్‌తో సిరీస్‌కు టీమిండియాను ప్రకటించిన రోజే టెస్ట్ కెప్టెన్‌ను కూడా ప్రకటిస్తారని అంతా భావించారు. కానీ ఎందుకనో కానీ సెలెక్టర్లు ఆ రోజు టెస్ట్ కెప్టెన్‌పై ఎటువంటి ప్రకటన చేయలేదు. టీమిండియా టెస్టులు ఆడడానికి మరో నెల రోజులు సమయం ఉండడం కూడా సెలెక్టర్లు ఆలస్యం చేయడానికి ఒక కారణం అని తెలుస్తోంది. చూస్తుంటే శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు జట్టును ప్రకటించిన రోజే కెప్టెన్‌ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications