Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హెడ్ కోచ్‌గా మళ్లీ రవిశాస్త్రినే!

Ravi Shastri has done well as head coach, says CAC member Anshuman Gaekwad

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే మళ్లీ నియామకం అయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ ఏర్పాటు చేసిన క్రికెట్ సలహా మండలి (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న అన్షుమన్‌ గైక్వాడ్‌ తెలిపాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో కోచ్‌గా రవిశాస్త్రిని మార్చాల్సిన అవసరం లేదని గైక్వాడ్‌ చూచాయిగా చెప్పేశాడు.

ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి

"జట్టు కోసం రవిశాస్త్రి చాలా కృషి చేశాడు. కోహ్లీసేన అందుకున్న వరుస విజయాలే అందుకు నిదర్శనం. నా దృష్టిలో అతనే మళ్లీ కోచ్‌గా నియామకం కావొచ్చు. మిగతా సిబ్బంది విషయానికొస్తే, దరఖాస్తు చేసుకున్న వారు బీసీసీఐ నిబంధనలకు అనుగుణంగా ఉన్నారో లేదో బట్టి తెలుస్తుంది" అని గైక్వాడ్‌ వెల్లడించాడు.

అన్షుమన్ గైక్వాడ్ చెప్పేశాడు

అన్షుమన్ గైక్వాడ్ చెప్పేశాడు

సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ శుక్రవారం సమావేశమై కపిల్ దేవ్ నేతృత్వంలో క్రికెట్ సలహా మండలి (సీఏసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీలో మాజీ క్రికెట‌ర్లు క‌పిల్ దేవ్‌, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిల‌ు సభ్యులుగా ఉన్నారు.

గైక్వాడ్‌ మాటలకు ప్రాధాన్యత

గైక్వాడ్‌ మాటలకు ప్రాధాన్యత

రవిశాస్త్రికి కపిల్‌ దేవ్ కూడా సన్నిహితుడే కాబట్టి ఆయన గైక్వాడ్‌ అభిప్రాయంతో విభేదించకపోవచ్చు. కాగా, టీమిండియా హెడ్ కోచ్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థుల‌ను ఈ స‌ల‌హా క‌మిటీ ఇంట‌ర్వ్యూ చేయ‌నుంది. ఈ నేపథ్యంలో గైక్వాడ్‌ మాటలకు ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కోహ్లీ సైతం శాస్త్రినే కొనసాగించాలనే బోర్డుకు సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది.

విండిస్ పర్యటన నేపథ్యంలో పదవీ కాలం పొడిగింపు

విండిస్ పర్యటన నేపథ్యంలో పదవీ కాలం పొడిగింపు

ప్రపంచకప్ ముగియడంతోనే రవిశాస్త్రితో పాటు సపోర్టింగ్ స్టాఫ్ పదవీ కాలం ముగిసినప్పటికీ వెస్టిండిస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని అందరి పదవి కాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్‌‌తో పాటు బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్టు, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది.

ఆగస్టులో ఇంటర్యూలు

ఆగస్టులో ఇంటర్యూలు

అయితే, ఆసక్తి కలిగిన అభ్యర్దులు జులై 30, సాయంత్రం ఐదు గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని బీసీసీఐ పేర్కొంది. ఆగస్టు నెలలో హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెట‌ర్లు మ‌హేళా జ‌య‌వ‌ర్ద‌నేతో పాటు గ్యారీ కిర్‌స్టన్‌, టామ్‌ మూడీ, మైక్ హెస్సన్‌లు ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Sunday, July 28, 2019, 10:14 [IST]
Other articles published on Jul 28, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+