Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : కోహ్లీ స్ట్రైక్ రేట్‌పై గొడవ.. మాజీ కోచ్ రవిశాస్త్రి ముక్కుసూటి కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్ల ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌ 2023లో అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని బ్యాటింగ్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఢిల్లీ బ్యాటర్లు చెలరేగడంతో ఆర్సీబీ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు.

ఈ మ్యాచ్‌లో కోహ్లీ 46 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అప్పటికే డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ అవుట్ అవడంతో కోహ్లీ చాలా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. క్రీజులో సాధ్యమైనంత ఎక్కువ సేపు ఉండాలని నిర్ణయించుకున్న కోహ్లీ తన ఇన్నింగ్స్ వేగం తగ్గించాడు. ఈ క్రమంలోనే అతని స్ట్రైక్ రేట్‌పై విమర్శలు వచ్చాయి.

 honest advise to Virat Kohli about Strike rate debate

వీటిపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. తన తర్వాత సరైన బ్యాటర్లు లేరనే టెన్షన్‌తోనే కోహ్లీ ఇలా యాంకర్ రోల్ పోషిస్తున్నాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అయితే ఇలా చేయడం పొట్టి ఫార్మాట్‌లో వేస్ట్ అని అభిప్రాయపడ్డాడు. ఒకసారి టెంపో దొరికితే దాన్ని మరింత పెంచడానికే ప్రయత్నించాలని కోహ్లీకి సలహా ఇచ్చాడు.

'ఒక్కసారి టెంపో అందుకుంటే ఇక ఆగకూడదు. మిగతా వాళ్ల గురించి ఏమాత్రం ఆలోచించకు. ఇదే నేను కోహ్లీకి ఇచ్చే సలహా. టీ20 క్రికెట్‌లో ఎక్కువ మంది బ్యాటర్లు ఆడాల్సిన అవసరం లేదు. కాబట్టి నువ్వు ఫామ్‌లో ఉంటే నువ్వే చెలరేగడం బెటర్. ఒకసారి టెంపో దొరికితే ఇంకా వేగంగా ఆడటానికి ట్రై చేయాలి' అని సూచించాడు.

అలాగే ఈ మ్యాచ్ తర్వాత సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫొటో కూడా తెగ వైరల్ అయింది. అంతకుముందు చిన్నస్వామి స్టేడియంలో ఈ రెండు టీమ్స్ తలపడినప్పుడు వీళ్లిద్దరూ చేతులు కలపలేదు. దీనిపై కూడా రవిశాస్త్రి స్పందించాడు. కోహ్లీ, ధోనీ వంటి వారికి కెమెరా కన్ను తమపై ఉంటుందనే సంగతి తెలుసునని, అందుకే జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పాడు.

Story first published: Monday, May 8, 2023, 15:12 [IST]
Other articles published on May 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+