For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచం మీకు సెల్యూట్ చేస్తోంది! డ్రెస్సింగ్ రూమ్‌లో ర‌విశాస్త్రి స్పీచ్.. ఈలలు వేసిన ఆటగాళ్లు (వీడియో)

Ravi Shastri Dressing Room Speech after Team India Test Series Win
Ind vs Aus 4th Test : History At Gabba,India Defeat Australia By 3 Wickets,Win Series 2-1

బ్రిస్బేన్‌: 32 ఏళ్లుగా గబ్బా స్టేడియంలో ఓటమే ఎరుగని ఆస్ట్రేలియా జట్టును రహానే సేన కంగారుపెట్టించింది. 328 రికార్డు లక్ష్యాన్ని ఛేదించి టెస్టుతో పాటు సిరీస్‌ను ఎగరేసుకుపోయింది. కీలక ఆటగాళ్లు గాయాల గండంలో చిక్కుకున్నా.. అద్వితీయమైన ఆటతో టీమిండియా సగర్వంగా రెండోసారి బోర్డర్‌-గవాస్కర్ ట్రోఫీ ముద్దాడింది. ఆసమయంలో 130 కోట్ల భారతీయుల గుండె ఉప్పొంగింది. ఇక టీమిండియా చారిత్ర‌క విజ‌యం త‌ర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ప్లేయ‌ర్స్ ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి.

ర‌విశాస్త్రి ప్రశంసల వర్షం

ర‌విశాస్త్రి ప్రశంసల వర్షం

గబ్బా మైదానం వేదికగా జరిగిన ఆఖరి టెస్టు‌ మ్యాచ్‌ విజయంలో రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, చేటేశ్వర్ పుజారా, మొహ్మద్ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్‌ కీలక పాత్ర పోషించారు. ఆఖరి టెస్టు‌లో భారత్‌ను విజయతీరాలకు చేర్చిన యువ ఆటగాళ్లపై కోచ్ ర‌విశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స్‌ను ఉద్దేశించి స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేశాడు. ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావ‌ని.. ఈ క్ష‌ణాన్ని పూర్తిగా ఆస్వాదించాలన్నాడు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన గెలుపు కాదన్నాడు.

ప్రపంచం సెల్యూట్ చేస్తోంది

ప్రపంచం సెల్యూట్ చేస్తోంది

'బాయ్స్.. 100 శాతం కష్టపడ్డారు. మీరు ప్రదర్శించిన ధైర్యం, సంకల్పం, స్ఫూర్తి అసాధారణం. గాయాలు ఎదురైనా.. 36 పరుగులకే ఆలౌట్ అయినా.. ఎన్నో ప్రతికూలతలు ఎదురైనా.. అద్భుతంగా ఆడారు. ఇది రాత్రికి రాత్రి వచ్చిన గెలుపు కాదు. గొప్ప పోరాట పటిమ చూపించి జట్టుగా విజయం సాధించారు. భారత్ మాత్రమే కాదు ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా చేశారు. ప్రపంచం సెల్యూట్ చేస్తోంది. ఇలాంటి సంద‌ర్భాలు మ‌ళ్లీ మ‌ళ్లీ రావు.. ఈ క్ష‌ణాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. అందరూ కలిసి బయటికి వెళ్లి సరదాగా గడపండి' ర‌విశాస్త్రి అన్నాడు.

హార్ట్‌ఎటాక్‌ వస్తుందనిపించింది

'మన విజయం మెల్‌బోర్న్‌లో మొదలైంది. సిడ్నీలో గొప్ప పోరాటం చేశారు. ఇక గబ్బాలో అద్భుత విజయం సాధించారు. శుభ్‌మన్‌.. గ్రేట్, గ్రేట్. పుజారా.. నువ్ ఒక అద్భుత ఆటగాడివి, అంతేకాదు పోరాట యోధుడువి. రిషబ్.. నీ ఇన్నింగ్స్ అద్భుతం. నువ్ బ్యాటింగ్ చేస్తుంటే ఎంతో మందికి హార్ట్‌ఎటాక్‌ వస్తుందనిపించింది. గొప్పగా జట్టును గెలిపించావు. కెప్టెన్ అజింక్య ర‌హానే టీమ్‌ను ముందుండి న‌డిపించిన తీరు అమోఘం. జట్టును పుంజుకునేలా చేశాడు. పరిస్థితుల్ని నియంత్రణలో ఉంచుతూ రహానే జట్టును ఘనంగా నడిపించాడు. ఇక ఆరంగేట్రం చేసిన ముగ్గురు ఆటగాళ్లు బాగా ఆడారు. సూపర్. ఎంజాయ్ చేయండి' అని ర‌విశాస్త్రి అన్నాడు.

ఈలలు, కేకలు

ఈలలు, కేకలు

డ్రెస్సింగ్ రూమ్‌లో విజ‌యానికి కార‌ణ‌మైన ప్లేయ‌ర్స్‌ను ఉద్దేశించి ర‌విశాస్త్రి స్ఫూర్తిదాయ‌క ప్ర‌సంగం చేస్తుండగా.. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్, కోచ్ భరత్ అరుణ్ ఈలలు వేశారు. మిగతా ఆటగాళ్లు కేకలు వేశారు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌ మొత్తం సందడిగా మారింది. కోచ్ ప్ర‌సంగానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇందులో ప్లేయ‌ర్స్ అంతా ఎంతో ఉత్సాహంగా. సరదాగా కనిపించారు. ఈ స్పీచ్‌కు సంబంధించి మొత్తం వీడియో కోసం కింద ట్వీట్‌లో ఉన్న బీసీసీఐ టీవీ లింక్ క్లిక్ చేయండి.

'ఇండియ‌న్స్‌ను త‌క్కువ అంచ‌నా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'

Story first published: Wednesday, January 20, 2021, 13:21 [IST]
Other articles published on Jan 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+