'త్వరలో క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు చదువుతారు'

ముంబై: క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు కూడా త్వరలో చదువుతారు. ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయికి దిగజారిందని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత జట్టు వెస్టిండీస్ పర్యటనకు బయలు దేరడానికి ముందు విలేకర్ల సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రవిశాస్త్రి పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రవిశాస్త్రి పై వ్యాఖ్యలు చేసాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఆ వార్తలు త్వరలో చదువుతారు:
మీడియా సమావేశంలో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు అబద్ధాలు. ఈ వార్తలు ఎవరు సృష్టించారో అర్ధం కావట్లేదు. ఇలాంటి విషయాలు చదవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. క్రికెటర్ల భార్యలు బ్యాటింగ్, బౌలింగ్ కూడా చేస్తున్నారనే వార్తలు త్వరలో చదువుతారు. ప్రస్తుత పరిస్థితి ఆ స్థాయికి దిగజారింది' అని రవిశాస్త్రి మండిపడ్డారు.

ఆటకన్నా ఎవరు గొప్ప కాదు:
'ఆటకన్నా జట్టులో ఎవరు గొప్ప కాదు. ఎవరైనా జట్టు కోసమే ఆలోచించేవాళ్లే. జట్టులో విభేదాలుంటే అన్ని ఫార్మాట్లలో ఇంత నిలకడగా రాణించేవాళ్ళం కాదు. డ్రెస్సింగ్ రూంలోని ఓ వ్యక్తిగా చెబుతున్నా.. జట్టులో ఎలాంటి విభేదాలు లేవు. అబద్దాలను పట్టించోకోవాల్సిన అవసరం లేదు. వాస్తవాలను గుర్తుంచుకోవాలి' అని రవిశాస్త్రి స్పష్టం చేశాడు.

విభేదాలు లేవు:
కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'రోహిత్‌కు నాకు మధ్య విభేదాలు పూర్తిగా నిరాధారం. అనవసరంగా వ్యక్తిగత జీవితాలను వివాదాల్లోకి లాగుతున్నారు. బయట ఉన్నవాళ్లు లేని వార్తలు పుట్టిస్తుంటే అసహ్యమేస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎంత మంచి వాతావరణం ఉందో ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. జట్టులో అందరూ ఎంతో స్నేహంగా ఉంటారు. ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉంటే.. జట్టు అంత మంచి ప్రదర్శనలు చేసేది కాదు' అని కోహ్లీ అన్నారు.

మిడిల్ ఆర్డర్ సమస్య పరిష్కరించాలి:
టాప్ ఆర్డర్ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్ సమస్యను పరిష్కరించాలి. మిడిల్ ఆర్డర్‌లో నిలకడగా రాణించే బ్యాట్స్‌మెన్ కోసం చూస్తున్నాం. అలాంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. కొంత సమయం పడుతుంది. ప్రపంచకప్ తర్వాత విశ్రాంతి గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. సెలక్టర్లకు ఎలాంటి సమాచారం వెళ్లిందో నాకు తెలియదు. రహానే ముందు ముందు వన్డే జట్టులోకి రాగలడు. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌పై దృష్టి పెట్టాలి. అంతకంటే ముందు టెస్టు ఛాంపియన్‌షిప్ గురించి ఆలోచించాలి' అని కోహ్లీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications