చేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు విమానం ఎక్కేసే రకం కాదు: ఘాటుగా బదులిచ్చిన రవిశాస్త్రి


హైదరాబాద్: ఇంగ్లీషు గడ్డపై టెస్టు సిరీస్ చేజారడంతో టీమిండియాపై వస్తున్న విమర్శలపై హెడ్ కోచ్ రవిశాస్త్రి ఘాటుగా బదులిచ్చాడు. ఇటీవల నాలుగో టెస్టులో 60 పరుగుల తేడాతో ఓడిన భారత జట్టు ఒక టెస్టు మిగిలి ఉండగానే ఐదు టెస్టుల సిరీస్‌ని 1-3తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన ప్రదర్శనపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు సైతం పెదవి విరిచారు. టాపార్డర్ బ్యాట్స్‌మెన్స్ ఇలా వరుసగా విఫలమవుతుంటే? హెడ్ కోచ్ రవిశాస్త్రి, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఏం చేస్తున్నారు అంటూ మాజీ క్రికెటర్ గంగూలీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
ఈ విమర్శలపై తాజాగా రవిశాస్త్రి బుధవారం స్పందించాడు. ఐదు టెస్టు ప్రారంభానికి ముందు రవిశాస్త్రి మాట్లాడుతూ "టెస్టు సిరీస్‌లో భారత్ జట్టు శక్తివంచన లేకుండా పోరాడుతోంది. మేం ఎంత గట్టిగా ప్రయత్నిస్తే.. ఇంగ్లాండ్ అంత కంటే కాస్త ఎక్కువ ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ టీమిండియా ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తూనే ఉంది" అని అన్నాడు.

తొమ్మిది టెస్టుల్లో గెలుపొందిన టీమిండియా
"గత మూడేళ్లుగా భారత్ జట్టు ఓవర్‌సీస్‌లో తొమ్మిది టెస్టుల్లో గెలుపొందింది. అలానే విండీస్‌తో ఒకటి, శ్రీలంకపై రెండు టెస్టు సిరీస్‌ల్లోనూ విజయం సాధించింది. గత 15-20ఏళ్ల కాలంలో దిగ్గజ క్రికెటర్లు జట్టులో ఉన్నప్పటికీ ఏ భారత్ జట్టు ఈ విజయాల్ని అందుకోలేకపోయింది. ఈ గణాంకాలే వాస్తవాన్ని చెబుతాయి. కాబట్టి.. ఆ జట్లతో పోలిస్తే ప్రస్తుత ఉన్న జట్టు మెరుగని నిరూపించాం" అని శాస్త్రి అన్నాడు.

టీమిండియా 3–1తో గెలిచి ఉండాల్సింది
"స్కోరు బోర్డు 3-1గా కనిపిస్తూ సిరీస్ కోల్పోయి ఉండవచ్చు. ఇది టీమిండియా 3-1తో గెలిచి ఉండాల్సిందని, లేదా 2-2తో సమం కావల్సిందన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయితే, అది మా జట్టుకు తెలుసు. కానీ, ఆ పరిస్థితిని దాటి సరైన రీతిలో పోరాటంతో జవాబివ్వాలి. గెలుపు తీరాన్ని చేరాలి. నిన్ను నువ్వు నమ్మితే ఏనాటిౖకైనా అది సాధ్యమే" అని శాస్త్రి కాస్తం ఘాటుగానే బదులిచ్చాడు.

ఓడినప్పుడు బాధ సహజం
"ఓడినప్పుడు బాధ సహజం. కానీ, ఈ జట్టు చేతులెత్తేసి ఇంటికెళ్లేందుకు మొదటి విమానం ఎక్కేసే రకం కాదు. పరిస్థితులపై పోరాడే రకం. ఆటగాళ్లు మానసికంగా దృఢంగా మారాలి. విదేశాల్లో భారత్ ఇంకెంత మాత్రం కేవలం గట్టి పోటీ ఇచ్చేందుకే ఆడాలనుకోవట్లేదు. ఇక నుంచి విజయాలు సాధించాలి. జట్టు తప్పులు ఎక్కడ చేసిందో తెలుసుకుని, సరిదిద్దుకోవాలి" అని అన్నాడు.

షాట్ల ఎంపికలో మెరుగుపడాల్సి ఉంది
భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రధాన తేడా మొయిన్ అలీనేనని, అతడు అశ్విన్ కన్నా మెరుగ్గా బౌలింగ్ చేశాడని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య చివరి టెస్టు ఓవల్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications