Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానెను తప్పించి రోహిత్‌ను తీసుకోవడం సరైన నిర్ణయమే: రవిశాస్త్రి

 Ravi Shastri defends dropping Ajinkya Rahane for Rohit Sharma, ‘overseas, you go on current form’

హైదరాబాద్: దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత్ ఆతిథ్య జట్టుతో తలపడి రెండు పరాజయాలను నెత్తినేసుకుంది. ఆ ఓటముల వెనుక జరిగిన విమర్శలలో ప్రధానమైనది అజింకా రహానేను జట్టులోకి తీసుకోకపోవడం. రహానెకు విదేశీ పిచ్‌లపై ఉన్నప్పటికీ అతని స్థానంలో రోహిత్‌ని ఎందుకు తీసుకున్నారని పలువులు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. వీటికి స్పందించిన రవిశాస్త్రి ఇలా సమర్థించుకున్నారు.

'తొలి టెస్టులో రహానె ఆడి, విఫలమై ఉంటే, రోహిత్‌ను ఎందుకు ఆడించలేదని అడిగేవాళ్లు. రోహిత్‌ ఆడాడు కాబట్టి, మీరిప్పుడు రహానెను ఎందుకు ఆడించలేదని అంటున్నారు'' అని సోమవారం రవిశాస్త్రి విలేకర్లకు తెలిపారు. ''ఫాస్ట్‌ బౌలర్ల విషయంలోనూ ఇలాగే జరిగి ఉండేది. మీకు చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అన్ని విషయాలు ఆలోచించే అత్యుత్తమ నిర్ణయం తీసుకుంది. దానికే కట్టుబడి ఉంది. విదేశాల్లో మేం ప్రస్తుత ఫామ్‌ ఆధారంగా జట్టును ఎంచుకుంటాం. మీరు పరిస్థితుల గురించి ఆలోచిస్తారు'' అని చెప్పాడు.

ఈ సారి ముందే వస్తాం: టీమ్‌ఇండియా మరో పది రోజుల ముందే దక్షిణాఫ్రికాకు వచ్చుంటే బాగుందేని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ''దక్షిణాఫ్రికాల్లో పరిస్థితులు భిన్నం. ఇక్కడ మరో పది రోజులు సాధన చేసుంటే బాగుండేదని అనిపిస్తోంది. కానీ మా పరాజయానికి అది సాకు కారాదు. పిచ్‌ రెండు జట్లకూ ఒక్కటే'' అన్నాడు. జట్టు రెండు వారాల ముందే వెళ్లేలా ఇకపై విదేశీ పర్యటనల షెడ్యూలు తయారు చేస్తారని ఆశిస్తున్నట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు.

తప్పులు చేశారు గానీ, లేకుంటే: రెండో టెస్టులో జరిగిన మూడు రనౌట్లు భారత్‌కు ప్రధాన వైఫల్యం. ఈ మ్యాచ్‌లలో భారత ఆటగాళ్లు చిన్నపిల్లలా తప్పులు చేశారని అభిప్రాయపడ్డాడు. ఈ తప్పులను జట్టు సరిదిద్దుకోవాలని రవిశాస్త్రి సూచించాడు. ''ఆ రనౌట్లు దెబ్బతీశాయి. అసలే పరిస్థితులు కఠినంగా మారాయి. దానికి రనౌట్లు తోడు కావడం మ్యాచ్‌ను మరింత క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. ఆ తప్పులు మళ్లీ జరగవని ఆశిస్తున్నాం. రెండు జట్ల మధ్య వ్యత్యాసం పెద్దగా లేని పరిస్థితుల్లో ఇలా వికెట్లు పారేసుకోవడం ఎంత మాత్రం సరికాదు. ఈ విషయం కుర్రాళ్లకు చెప్పాం'' అని రవిశాస్త్రి వివరించాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 23, 2018, 10:07 [IST]
Other articles published on Jan 23, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+