ఆ విషయంలో భువనేశ్వర్ కుమార్‌తో రెగ్యులర్‌గా వాగ్వాదం జరిగేదన్న రవిశాస్త్రి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంతంతమాత్రంగా ఆడుతోంది. ఈ జట్టు తొలుత రెండు వరుస ఓటములతో ఈ సీజన్ ను ప్రారంభించింది. అయితే వరుసగా ఐదు విజయాలు సాధించి అద్భుతంగా కోలుకుంది. టాప్-4లో సన్ రైజర్స్ ఒక టీంగా మారుతుందనిపించేలా ప్రదర్శించింది. ఇక ఆ తర్వాత వరుసగా ఐదు పరాజయాలతో మళ్లీ నిరాశపరిచింది. గత మ్యాచ్‌లో ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన తరుణంలో ముంబై ఇండియన్స్‌పై గెలుపొందింది. ప్రస్తుతం 13మ్యాచుల్లో 6మ్యాచ్‌లు గెలిచిన సన్ రైజర్స్ 12పాయింట్లతో నెగెటివ్ నెట్ రన్ రేట్‌తో 8వ స్థానంలో కొనసాగుతోంది. అయినప్పటికీ ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు ఉన్న సానుకూలాంశం ఏంటంటే పేస్ అటాక్.
ఈ సీజన్లో సన్ రైజర్స్ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ సీజన్ మొత్తం వేగవంతమైన డెలివరీలతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతను ఎడిషన్‌లో 157కి.మీ. వేగంతో ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డును కలిగి ఉన్నాడు. అలాగే సీనియర్ ప్లేయర్ అయిన భువనేశ్వర్ కుమార్, మరో ప్లేయర్ టి.నటరాజన్ కూడా నిలకడగా బౌలింగ్ చేశారు. ఇక అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఉమ్రాన్ (21 వికెట్లు), నటరాజన్ (18 వికెట్లు) టాప్-10లో ఉండగా, భువనేశ్వర్ 12వికెట్లు తీశాడు. అయితే భువీ 7.19ఎకానమీ రేట్‌తో బౌలింగ్ చేయడం గమనార్హం.

రెగ్యులర్ ప్లేయర్‌గా ఉండాల్సినోడు
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ 19వ ఓవర్ బౌలింగ్ వేసి ఒక వికెట్ తీశాడు. అలాగే ఒక్కపరుగు ఇవ్వకుండా ఆ ఓవర్ మెయిడెన్ చేశాడు. దీంతో మ్యాచ్ సన్ రైజర్స్ వైపు మలుపు తీసుకుంది. చివరికి ముంబై 3పరుగుల తేడాతో సన్ రైజర్స్ చేతిలో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భువీ ప్రదర్శనను మెచ్చుకున్న మాజీ టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి భువనేశ్వర్ ఆకట్టుకునే ప్రదర్శనల గురించి వివరంగా మాట్లాడాడు. అతని ఫిట్‌నెస్ గురించి శాస్త్రి తరచుగా భువీతో వాదించేవాడని వెల్లడించాడు. శాస్త్రి ప్రకారం.. భువనేశ్వర్ ఫిట్ నెస్‌తో ఉంటే అన్ని ఫార్మాట్లలో భారత్‌కు రెగ్యులర్ ప్లేయర్‌గా ఉండేవాడని పేర్కొన్నాడు.

అందుకే భువీతో వాదించేవాడిని
భువీ బౌలింగ్ పట్ల నాకేమీ ఆశ్చర్యం లేదు. నేను భువీ (భువనేశ్వర్ కుమార్)ని కలిసిన ప్రతిసారీ అతనితో వాదించాల్సి వచ్చేది. అతను తన ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెట్టగలిగితే, సరిగ్గా ఫిట్ నెస్ మెయింటెన్ చేయగలిగితే.. టీమిండియా తరఫున అన్ని ఫార్మాట్‌లలో ఉండే ఆటగాడు అతను. అతని అనుభవం, సామర్థ్యం అసాధారణం అని నేను చెప్పగలను. ఇంగ్లాండ్ లేదా న్యూజిలాండ్‌లో పర్యటించిన ప్రతిసారీ.. భువీ ఫిట్‌నెస్ లోపంతో ఇబ్బంది పడి జట్టుకు దూరమయ్యేవాడు అని శాస్త్రి ఈఎస్పీఎన్‌ఇన్ఫోతో అన్నాడు.

అతను ఫిట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా సెలెక్ట్ అవుతాడు
'గత రెండేళ్లలో భువీ టెస్టుల్లో 50వికెట్లు కోల్పోయాడని నేను చెప్పగలను. అతను ఫిట్‌గా ఉంటే భారత జట్టుకు ఆటోమేటిక్‌గా ఎంపికవుతాడు.' అని శాస్త్రి పేర్కొన్నాడు. ఇకపోతే భువనేశ్వర్ కుమార్ శ్రీలంకతో జరిగిన మునుపటి టీ20 సిరీస్‌లో టీమిండియా తరఫున ఆడాడు. ఇకపోతే అతను టెస్టుల్లో 2018 జనవరిలో టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడు చివరిసారిగా ఆడాడు. అంటే దాదాపు నాలుగేళ్లుగా టెస్టుల్లో భువీ కన్పించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications