'క్యూలో నిలబడను, కోచ్ పదవి ఇస్తానంటే అప్లై చేస్తా!'
హైదరాబాద్: టీమిండియా తదుపరి కోచ్ ఎవరు?లో కొత్త ట్విస్ట్ వచ్చి పడింది. కెప్టెన్ కోహ్లీ కోసం కుంబ్లేని అవమానకరంగా సాగనంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కోహ్లీ కోసం టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి కోసం బతిమాలుతోంది.
కొత్త కోచ్ పదవి కోసం మరిన్ని దరఖాస్తులను ఆహ్వానించాలని బీసీసీఐ నిర్ణయించింది. కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా రవిశాస్త్రిని కూడా కోచ్ పదవి కోసం అప్లై చేసుకోమని బీసీసీఐ కోరింది. అయితే గతేడాది కోచ్ పదవి కోసం అప్లై చేసుకున్న సమయంలో గంగూలీ చేతిలో శాస్త్రి అవమానానికి గురయ్యాడు. అప్పటి అవమానాన్ని మరిచిపోని రవిశాస్త్రి బోర్డుతో ఈసారి తెలివిగా ప్రవర్తించాడు.

అప్లై చేస్తా కానీ.. క్యూలో నిలబడను
అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో నిలబడను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తా అంటేనే చేస్తానని తేల్చి చెప్పినట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు బీసీసీఐ ముందు తన కండిషన్స్ కూడా ఉంచాడు. రవిశాస్త్రికి కెప్టెన్ కోహ్లీ మద్దతు ఉండటంతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడని క్రికెట్ నిపుణులు అంటున్నారు. వాస్తవానికి గతేడాది కుంబ్లేతోపాటు రవిశాస్త్రి కూడా కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. కోచ్ ఎంపిక ప్రక్రియను బీసీసీఐ సచిన్, గంగూలీ, లక్ష్మణ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీకి బీసీసీఐ అప్పగించింది.

రవిశాస్త్రి Vs గంగూలీ
ఈ కమిటీలో ఉన్న గంగూలీకి మాత్రం రవిశాస్త్రికి కోచ్ పదవి ఇవ్వడం ఇష్టం లేదు. దీంతో రవిశాస్త్రిని ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలోనూ గంగూలీ ప్యానెల్‌లో లేడు. ఆ తర్వాత క్రికెట్ సలహా కమిటీ కుంబ్లేని కోచ్‌గా ఎంపిక చేసింది. ఈ విషయమై రవిశాస్త్రి, గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో రవిశాస్త్రి కాస్తంత బెట్టుగా వ్వవహారిస్తున్నాడని అంటున్నారు.

కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి 7-10 రోజులు
కొత్తగా దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు 7-10 రోజులు అవకాశం ఇచ్చింది. సరైన అర్హత, అనుభవంతో పాటు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ సూచించింది. గత నెలలో దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు రేసులో కుంబ్లే ఉండటంతో ఎక్కువ దరఖాస్తులు రాలేదు. ప్రస్తుతం కుంబ్లే వైదొలగడంతో చాలా మంది ఆసక్తి చూపే అవకాశం ఉంది.

కుంబ్లే తప్పుకోవడంతో తెరపైకి రవిశాస్త్రి పేరు
కోచ్ పదవి నుంచి కుంబ్లే తప్పుకోవడంతో తాజాగా తెరపైకి రవిశాస్త్రి పేరు వచ్చింది. అయితే రవిశాస్త్రికి కచ్చితంగా ఇస్తామని బోర్డు హామీ ఇచ్చిందో లేదో తెలియదు గానీ జులై చివర్లో మొదలయ్యే శ్రీలంక పర్యటన లోపు కొత్త కోచ్ ఎంపికను మాత్రం పూర్తి చేస్తామని బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా స్పష్టంచేశారు. కొత్త కోచ్ 2019 వరల్డ్‌కప్ వరకు ఉంటాడని కూడా ఆయన చెప్పారు. కాగా, బీసీసీఐ మే 31లోపు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, లాల్‌చంద్ రాజ్‌పుత్, రిచర్ పైబస్, దొడ్డ గణేశ్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications