Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: ఆ సత్తా వాషింగ్టన్ సుందర్‌కు ఉంది: రవిశాస్త్రి

IND vs ENG: 18 ఏళ్ల వయస్సులో వన్డే, టీ20ల్లో అరంగేట్రం చేసిన వాషింగ్టన్ సుందర్‌కు తన మొదటి టెస్ట్ మ్యాచ్ 2021లో లభించింది. ఆస్ట్రేలియా పర్యటనలో అందరూ సీనియర్ ఆటగాళ్లు గాయపడగా.. 22 ఏళ్ల వయస్సులో బ్రిస్బేన్‌లోని గబ్బాలో వాషింగ్టన్ సుందర్ భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. అయితే ఆ తర్వాత ఆ ఫార్మాట్‌లో వాషింగ్టన్ సుందర్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు.

వాషింగ్టన్ సుందర్‌పై రవిశాస్త్రి ప్రశంసలు
వాషింగ్టన్ సుందర్‌లో టీమిండియాకు తదుపరి ప్రధాన టెస్ట్ ఆల్‌రౌండర్‌గా ఎదిగే సామర్థ్యం ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. సుందర్ దేశీయ పరిస్థితులలో ఒక మంచి బౌలర్‌తో పాటు సహజంగా ప్రతిభావంతుడైన బ్యాటర్ అని శాస్త్రి పేర్కొన్నారు. వాషింగ్టన్ సుందర్ ఇప్పటివరకు 11 టెస్ట్ మ్యాచ్‌లలో 545 పరుగులు చేసి 30 వికెట్లు పడగొట్టాడు. అయితే రవిశాస్త్రి మాట్లాడుతూ.. "నాకు మొదటి నుంచి వాషింగ్టన్ సుందర్ ఆట అంటే చాలా ఇష్టం. నేను అతడిని మొదటిసారి చూసినప్పుడు అద్భుతమైన ఆటగాడు అని, చాలా ఏళ్ల వరకు టీమిండియాకు ఒక అద్బుతమైన ఆల్‌రౌండర్‌గా ఉండే సామర్థ్యం ఉందని చెప్పాను."అని రవిశాస్త్రి "ది ఐసీసీ రివ్యూ"లో వెల్లడించారు.

Ravi Shastri Backs Washington Sundar as India s Future Test All-Rounder

వాషింగ్టన్ సుందర్ ముఖ్యంగా దేశంలోని టర్నింగ్ పిచ్‌లపై రెడ్ బాల్‌తో మరిన్ని మ్యాచ్‌లు ఆడాలని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. "అతనికి కేవలం 25 ఏళ్లు మాత్రమే. వాషింగ్టన్ సుందర్ ఇంకా చాలా టెస్ట్ క్రికెట్ ఆడాల్సి ఉందని నేను అనుకుంటున్నాను. బంతి టర్న్ అయ్యే పిచ్‌లలో వాషింగ్టన్ సుందర్ చాలా ప్రమాదకరంగా మారగలడు. న్యూజిలాండ్‌తో ఆడినప్పుడు ఇది రుజువైంది. వాషింగ్టన్ సుందర్ కొంత మంది సీనియర్ స్పిన్నర్ల కంటే మెరుగ్గా బౌలింగ్ చేశాడు, మంచి బ్యాటింగ్ కూడా." అని రవిశాస్త్రి అన్నారు.

న్యూజిలాండ్‌తో జరిగిన 2024 దేశీయ టెస్ట్ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్ 4 ఇన్నింగ్స్‌లలో 16 వికెట్లు పడగొట్టాడు. రవిశాస్త్రి సుందర్ బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా ప్రశంసించారు. వాషింగ్టన్ సుందర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా ముందుకు పంపవచ్చని అన్నారు. "అతను సహజంగా ప్రతిభావంతుడైన బ్యాట్స్‌మెన్. అతను ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మెన్ కాదు. అతను చాలా త్వరగా బ్యాటింగ్ లైనప్‌లో ఆరో నంబర్‌కు రాగలడు. అతను ఆత్మవిశ్వాసం పొందిన తర్వాత, అతని ఆట మరింత మెరుగుపడుతుందని నేను అనుకుంటున్నాను. సుందర్ విదేశాల్లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు.వాషింగ్టన్ సుందర్ ఫిట్‌నెస్ ఉన్న ఆటగాడు, ఎక్కువ స్పెల్స్ వేయగలడు. అవసరమైనప్పుడు నియంత్రణను కూడా కొనసాగించగలడు," అని రవిశాస్త్రి అన్నారు.లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లోని మొదటి ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు పడగొట్టాడు.

Story first published: Tuesday, July 22, 2025, 13:31 [IST]
Other articles published on Jul 22, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+