బెంగుళూరు: టీమిండియా డైరెక్టర్, భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రిపై బ్యాటింగ్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర అద్భుతమైని కొనియాడారు. బంగ్లాదేశ్ పర్యటన అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే నియమిస్తే బాగుంటుందని చెప్పాడు.
ప్రస్తుతం టీమిండియా బంగ్లా పర్యనటలో ఉంది. బంగ్లాదేశ్‌తో ఒక వన్డే మ్యాచ్, మూడు ట్వంటీ20లు ఆడనుంది. బంగ్లా పర్యటనకు ముందు బీసీసీఐ జట్టు డైరెక్టర్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే. టీమిండియా కోచ్‌గా ఢంకన్ ప్లెచర్ పదవీ కాలం ముగియడంతో రాజీనామా చేశారు.
అప్పటి నుంచి టీమిండియా కోచ్ పదవికి ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి అద్భుతమైన పాత్రను పోషిస్తున్నాడని చెప్పిన ద్రవిడ్, వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్ నిష్క్రమణపై మాత్రం స్పందించలేదు.

ఇక టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై స్పందించిన ద్రవిడ్ అభిమానులు కొంత సమయం వేచిచూడాలని అన్నారు. కోహ్లీకి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు. రాబోయే రోజుల్లో కెప్టెన్‌గా మంచి నిర్ణయాలు తీసుకుంటాడని తెలిపారు.
ఆస్టేలియాలో జరిగిన వరల్డ్ కప్‌లో టీమిండియా డైరెక్టర్‌గా రవిశాస్త్రి పాత్ర మాత్రం వెలకట్టలేనిదని చెప్పారు. మాజీ కెప్టెన్‌గా శాస్త్రి అనుభవం జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో ఎలాంటిసందేహం లేదని రాహుల్ తెలిపాడు. ఇటీవలే రాహుల్ ద్రవిడ్‌ని ఇండియా-ఎ, అండర్ -19 జట్టులకు కోచ్‌గా నియమిస్తూ బీసీసీఐ ప్రకటించింది.