అవును, నేను కోచ్ పదవికి దరఖాస్తు చేస్తున్నా: రవిశాస్త్రి
హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్ పదవికి టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసేందుకు సిద్ధమైనట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారా? అని క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కుంబ్లే రాజీనామా అనంతరం ప్రధాన కోచ్ పదవి రేసులో వినిపిస్తున్న మొదటి పేరు రవిశాస్త్రి. గతంలో రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో పాటు కెప్టెన్ కోహ్లీ కూడా రవిశాస్త్రికి మద్దతు తెలుపడమే.
ఈ నేపథ్యంలో 'అవును, నేను కోచ్ పదవికి దరఖాస్తు చేయాలని అనుకుంటున్నా' అని ఓ జాతీయ పత్రికతో రవిశాస్త్రి అన్నాడు. 'కోచ్ బాధ్యతలు అప్పగించాలనుకుంటే అప్పగించండి. నేను మాత్రం ఇంటర్వ్యూ కోసం వరుసలో నిలబడను' అని గతంలో చేసిన వ్యాఖ్యల గురించి అడగ్గా... ఆ వ్యాఖ్యలను రవిశాస్త్రి కొట్టిపారేశాడు.

కుంబ్లే రాజీనామాతో మళ్లీ దరఖాస్తుల ఆహ్వానం
కుంబ్లే రాజీనామా అనంతరం బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కోచ్ ఎంపిక ప్రక్రియ కోసం గడువుని సైతం పెంచింది. జులై 9 వరకు కోచ్ పదవికి అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి ఓ ప్రకటన విడుదల చేశారు.

జులై 9 చివరి తేదీ
పురుషుల ప్రధాన కోచ్ పదవికి ఆహ్వానించిన దరఖాస్తుల గడువు తేదీని పెంచుతున్నామని అందులో పేర్కొన్నారు. అంతకముందు కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్‌మూడీ, రిచర్డ్ పైబస్, లాల్‌చంద్ రాజ్‌పుత్, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్నారు.

త్వరలో ఇంటర్యూలు
గంగూలీ, సచిన్, లక్ష్మణ్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ వీరిన త్వరలోనే ఇంటర్యూ చేయనున్నారు. కుంబ్లే రాజీనామాతో ప్రధాన కోచ్ పదవికి సరైన వ్యక్తిని ఎంపిక చేసేందుకు గంగూలీ, లక్ష్మణ్, సచిన్‌తో కూడిన క్రికెట్ సలహా కమిటీ ముందు మరిన్ని అప్లికేషన్స్ ఉంచాలనే ఉద్దేశంతో బీసీసీఐ దరఖాస్తులను మళ్లీ ఆహ్వానించింది.

కండిషన్ పెట్టిన రవిశాస్త్రి
ఈ నేపథ్యంలో రవిశాస్త్రిని కూడా కోచ్ పదవి కోసం అప్లై చేసుకోమని బీసీసీఐ అంతకముందు కోరినట్లు వార్తలు వచ్చాయి. అప్లై చేస్తా కానీ.. నాకు కోచ్ పదవి కావాలని అందరిలాగా క్యూలో నిలబడను.. కచ్చితంగా నాకే ఆ పదవి ఇస్తానంటేనే అప్లే చేస్తానంటూ కండిషన్ పెట్టిన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications