Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఈరోజే టీమిండియా హెడ్ కోచ్‌ పదవికి ఇంటర్వ్యూలు: కోచ్‌గా మళ్లీ శాస్త్రినే!

Ravi Shastri all set for another stint as India head coach

హైదరాబాద్: టీమిండియా తదుపరి కోచ్ ఎవరన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది. ఇందుకోసం కపిల్‌దేవ్‌, అన్షుమన్‌ గైక్వాడ్‌, శాంత రంగస్వామిలతో కూడిన బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ప్రస్తుత కోచింగ్‌ బృందం కాంట్రాక్టు ప్రపంచకప్‌తో ముగిసినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల కాంట్రాక్టును పొడిగించిన సంగతి తెలిసిందే.

కొత్త కోచ్ నియామక ప్రక్రియ కోసం

కొత్త కోచ్ నియామక ప్రక్రియ కోసం

అనంతరం కొత్త కోచ్‌ కోసం బీసీసీఐ దరఖాస్తులకు ఆహ్వానించింది. కొత్త కోచ్ నియామక ప్రక్రియ కోసం బీసీసీఐ ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రితో పాటు టామ్‌ మూడీ, మైక్‌ హెసన్‌, ఫిల్‌ సిమన్స్‌, రాబిన్‌ సింగ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌లను షార్ట్‌లిస్ట్‌ చేసింది. ఈ ఆరుగురిని శుక్రవారం ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో ఇంటర్వ్యూ చేయనున్నారు.

కోహ్లీ మాట చెల్లుబాటవుతుందా?

కోహ్లీ మాట చెల్లుబాటవుతుందా?

టీమిండియా హెడ్ కోచ్‌ ఎంపిక విషయంలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాట చెల్లుబాటవుతుందా లేక కపిల్‌ దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) మరో విధంగా ఆలోచిస్తోందా! అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కెప్టెన్‌ కోహ్లి బహిరంగంగానే రవిశాస్త్రికి తన మద్దతు ప్రకటించాడు. కమిటీ సభ్యుడైన అన్షుమన్‌ గైక్వాడ్‌ సైతం అతడి పట్ల సానుకూలత వ్యక్తం చేశాడు.

రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌ పదవి!

రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌ పదవి!

దీంతో రవిశాస్త్రికే మళ్లీ కోచ్‌ పదవి దక్కొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణంగా కోచ్‌గా రవిశాస్త్రి ట్రాక్ రికార్డే. శాస్త్రి కోచింగ్‌లోనే టీమిండియా తొలిసారిగా ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ గెలుచుకుంది. రవిశాస్త్రి కోచ్‌గా ఎంపికైనప్పటి నుంచి (జులై 2017) భారత్‌ 21 టెస్టులు ఆడితే 13 గెలిచింది. వన్డేల్లో 60 మ్యాచ్‌లలో 43 గెలవగా, టి20ల్లో 36 మ్యాచ్‌లలో 25 సొంతం చేసుకుంది.

స్కైప్‌ ద్వారా కమిటీతో మాట్లాడనున్న రవిశాస్త్రి

స్కైప్‌ ద్వారా కమిటీతో మాట్లాడనున్న రవిశాస్త్రి

ఇక, హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో ఒకరిద్దరు మినహా నేరుగా ఇంటర్వ్యూలు హాజరయ్యే అవకాశాలు లేవు. విండిస్ పర్యటనలో ఉన్న రవిశాస్త్రి స్కైప్‌ ద్వారా కమిటీతో మాట్లాడతాడు. విదేశీ అభ్యర్థులు సైతం ఇలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొంటారు. ఇంటర్వ్యూలు అయ్యాక రెండు మూడు రోజుల్లోపే టీమిండియా కోచ్‌ ఎవరన్నది బీసీసీఐ ప్రకటించనుంది.

ఎమ్మెస్కే ప్రసాద్‌

ఎమ్మెస్కే ప్రసాద్‌

హెడ్ కోచ్‌ను ఎంపిక చేసిన అనంతరం.. సహాయ సిబ్బందిని ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ మినహా మిగతా సిబ్బంది యథాతథంగా ఉంటారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. సహాయక సిబ్బంది కోసం జరిగే ఇంటర్వ్యూలో మాజీ సెలెక్టర్‌ విక్రమ్‌ రాథోడ్‌, ప్రమీణ్‌ ఆమ్రే, జాంటీ రోడ్స్‌ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బ్యాటింగ్‌ కోచ్‌గా సంజయ్‌ బంగర్‌ స్థానంలో విక్రమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతడికి ఆమ్రే, ఇంగ్లండ్‌ మాజీలు జొనాథన్‌ ట్రాట్‌, రాంప్రకాష్‌ నుంచి గట్టిపోటీ ఎదురుకానుంది. ఒకవేళ రాథోడ్‌ను సెలెక్ట్‌ చేస్తే తనకు విరుద్ధ ప్రయోజనాలేమి లేవని ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.

Story first published: Friday, August 16, 2019, 7:55 [IST]
Other articles published on Aug 16, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+