Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup Final: క్వార్ట‌ర్ టూ ఫైన‌ల్‌.. నాకౌట్ స్టేజ్‌లో కొత్త బంతితో ర‌వి కుమార్ అద్భుతం!

Ravi Kumar takes wickets with a new ball in the Under-19 World Cup knockout stage matches

వెస్టిండీస్ వేదిక‌గా జ‌రుగుతున్న అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా యువ బౌల‌ర్ ర‌వికుమార్ కొత్త బంతితో చెల‌రేగుతున్నాడు. ముఖ్యంగా నాకౌట్ స్టేజ్‌లో ర‌వి కుమార్ బౌలింగ్ దెబ్బ‌కు ప్ర‌త్య‌ర్థులు క్రీజులో నిల‌బ‌డ లేక‌పోతున్నారు. పేస్ బౌల‌ర్ ర‌వి కొత్త బంతిని ఆడ‌లేక వికెట్లు పారేసుకుంటున్నారు. క్వార్ట‌ర్ ఫైన‌ల్ మొద‌లుకోని ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర‌కు కొత్త బంతితో ర‌వి కుమార్‌ త‌న తొలి ఓవ‌ర్‌లోనే వికెట్ ప‌డ‌గొట్టి ప్ర‌త్య‌ర్ధిని చావు దెబ్బ కొట్టాడు. కొత్త బంతితో ర‌వి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ప్ర‌త్య‌ర్థులు బెంబెలెత్తి పోతున్నారు.

తొలి ఓవ‌ర్‌లోనే వికెట్లు

తొలి ఓవ‌ర్‌లోనే వికెట్లు

బంగ్లాదేశ్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్ మ్యాచ్‌లో ర‌వికుమార్ తాను వేసిన 3వ బంతికే వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇక ఆస్ట్రేలియాతో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్య‌చ్‌లో త‌న తొలి బంతికే వికెట్ తీసి కంగారుల‌ను బెంబేలెత్తించాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జ‌ర‌గుతున్న ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ తాను వేసిన ఐదో బంతికే వికెట్ తీసి ఇంగ్లండ్‌ను చావు దెబ్బ‌కొట్టాడు.

త‌ద్వారా వ‌ర‌ల్డ్‌క‌ప్ నాకౌట్ పోరులో ఈ ఘ‌న‌త సాధించిన బౌల‌ర్‌గా ర‌వి కుమార్ అరుదైన రికార్డును త‌న ఖాతాలోవేసుకున్నాడు. ఇలా క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో బంగ్లాదేశ్‌పై 3, సెమీ ఫైన‌ల్‌లో ఆస్ట్రేలియాపై రెండు వికెట్లతో స‌త్తా చాటాడు. ఇక తాజాగా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న ఫైన‌ల్‌లో ర‌వి కుమార్ ఇప్ప‌టికే రెండు వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు ర‌వి 10 వికెట్లు తీశాడు.

 ఫైన‌ల్లో చెల‌రేగిన ర‌వి

ఫైన‌ల్లో చెల‌రేగిన ర‌వి

భార‌త్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రుగుతున్న‌ అండ‌ర్ 19 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌ టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను రవి కుమార్ కొత్త బంతితో బెంబెలెత్తిస్తున్నాడు. తాను వేసిన ఐదో బంతికే 2 ప‌రుగులు చేసిన ఇంగ్లండ్ ఓపెన‌ర్‌ జాకబ్ బెథెల్‌ను ఎల్బీడ‌బ్ల్యూలో ఔట్ చేశాడు.

దీంతో ఇంగ్లీష్ జ‌ట్టు 1.5 ఓవ‌ర్ల‌లో 4 ప‌రుగులు మాత్ర‌మే చేసి తొలి వికెట్ కోల్పోయింది. ఇంత‌లోనే ర‌వికుమార్ మ‌ళ్లీ చెల‌రేగాడు. త‌న రెండో ఓవ‌ర్‌లోనూ వికెట్ ప‌డ‌గొట్టాడు. ఇంగ్లండ్ కెప్టెన్ టామ్ పెర్ట్స్‌ను డ‌కౌట్ చేశాడు. ర‌వి దెబ్బ‌కు పెర్ట్స్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ర‌వి ధాటికి ఇంగ్లీష్ జ‌ట్టు 3.3 ఓవ‌ర్ల‌లో 18 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది.

వేలంలో హాట్ కేక్‌గా ర‌వి కుమార్‌

వేలంలో హాట్ కేక్‌గా ర‌వి కుమార్‌

వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇచ్చిన సంచ‌న‌ల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐపీఎల్ మెగా వేలంలో యువ పేస‌ర్ ర‌వి కుమార్ ఫ్రాంచైజీల‌న్నింటికీ హాట్ కేక్‌లా మార‌డం ఖాయ‌మైపోయింది. కొత్త బంతితో ర‌వి సృష్టిస్తున్న విధ్వంసానికి టీంల‌న్నీ ఫిదా అయిపోయాయి. ఎంతో ఒత్తిడి ఉండే ప్ర‌పంచ‌క‌ప్ నాకౌట్ స్టేజ్‌లో తొలి ఓవ‌ర్‌లోనే వికెట్లు తీయ‌డంతో ర‌విని ఎంత ధ‌రైనా స‌రే కొనుగోలు చేయాల‌ని ఫ్రాంచెజీల‌న్నీ భావిస్తున్నాయి. దీంతో ఈ వేలంతో ర‌వి కోటీశ్వ‌రుడు అయిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి వేలంలో ఈ సంచ‌న‌లన యువ పేస‌ర్‌ను ఏ ఫ్రాంచైజీ ద‌క్కించుకుంటుందో!

Story first published: Saturday, February 5, 2022, 19:46 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+