రవి బిష్ణోయ్ ఇంటి వద్ద సంబరాలు.. అంతా ఆ కోచ్ వల్లే అంటూ ఎమోషనల్

వెస్టిండీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో 21 ఏళ్ల యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు సెలెక్టర్లు చోటు కల్పించారు. దీంతో రవి బిష్ణోయ్ సంతోషం వ్యక్తం చేశాడు. అభిమానులు, సన్నిహితుల అభినందనలతో అతడి ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో తాను ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే సమయంలో హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తనను ఎలా తీర్చిదిద్దాడో రవి గుర్తు చేసుకున్నాడు. కుంబ్లేపై ప్రశంసలు కురిపించాడు. తన ప్రణాళికలను ఎలా అమలు చేయాలనే విషయంపై అనిల్ కుంబ్లే సలహాలు ఇచ్చి సహాయం చేసినట్టు రవి బిష్ణోయ్ చెప్పాడు. కుంబ్లే వల్లే ఈ రోజు భారత జట్టుకు ఎంపికైనని చెప్పుకొచ్చాడు.

కుంబ్లే నుంచి చాలా నేర్చుకున్నాను
''నేను అనిల్ కుంబ్లే నుంచి చాలా నేర్చుకున్నాను. కుంబ్లే పాఠాలు నేను మంచి క్రికెటర్‌గా ఎదగడానికి సహాయపడ్డాయి. ఒత్తిడిలోనూ ఆత్మ విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలని సూచించాడు. తద్వారా మంచి ఫలితాలు వస్తాయని చెప్పాడు. నన్ను వెన్ను తట్టి ప్రోత్సహించాడు. అతను నాకెప్పుడూ మార్గ నిర్ధేశం చేసేవాడు. ఆ విషయాలు నాకు చాలా సహాయంగా మారాయి. మనలోని బలాలను గుర్తించి వాటిని సరైన సమయంలో ప్రణాళికలుగా అమలు చేయాలని చెప్పాడు. మన ప్రణాళికలను మైదానంలో అనుకున్నట్టుగా అమలు చేసినప్పడే సరైన ఫలితాలు వస్తాయని తెలిపాడు. స్వేచ్ఛగా ఆడేందుకు అనిల్ కుంబ్లే నాలో తగిన ఆత్మవిశ్వసం నింపాడు. అవన్నీ ప్రస్తుతం నేను మెరుగైన క్రికెటర్‌గా ఎదగడానికి సహాయపడుతున్నాయి.'' అని టీమిండియాకు ఎంపికైన సందర్భంగా ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవి బిష్ణోయ్ తెలిపాడు.

ఉత్తమ ప్రదర్శన ఇవ్వడం కోసం ఎదురుచూస్తా
ఇక తాను భారత జట్టుకు ఆడడం కోసం ఎదురు చూస్తున్నానని రవి బిష్ణోయ్ చెప్పాడు. విండీస్‌తో సిరీస్ కోసం తనను తాను సిద్ధం చేసుకున్నానని, అవకాశం వచ్చినప్పుడు 100 కు 100 శాతం ప్రదర్శనను ఇవ్వడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పాడు. ఉత్తమ ప్రదర్శన ఇవ్వడానికి నా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటానని రవి తెలిపాడు. అలాగే ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తనను వేలానికి ముందే రిటెన్షన్ చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. రిటెన్షన్ జాబితాలో అతి కొద్ది మందిలో నేను కూడా ఉండడం సంతోషం కల్గిస్తుందని చెప్పాడు. ఇక లక్నో కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో గతంలో పంజాబ్ కింగ్స్ జట్టెలో ఆడానని రవి గుర్తు చేసుకున్నాడు.

రవి ఇంటి వద్ద సంబరాలు
తొలి సారి భారత జట్టుకు ఎంపికైన రవి బిష్ణోయ్‌కు శ్రేయోభిలాషులు, స్నేహితులు, అభిమానులు, బంధువుల నుంచి అభినందనలు అందుతున్నాయి. రవి ఇంటి వద్ద జనాలు భారీగా గుమికూడా అతడిని అభినందించారు. రవి భారత జట్టుకు ఎంపికైన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. దీంతో రవి బిష్ణోయ్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications