తొలి సారి టీమిండియాలోకి అడుగు పెట్టినప్పుడు భయమేసింది.. రవి బిష్ణోయ్ అనుభవాలు

కోల్‌కతా: వెస్టిండీస్‌తో ప్రారంభం టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ స్పిన్నర్ రవి బిష్టోయ్ అదరగొట్టాడు. కెరీర్‌లో అరంగేంట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో రవి బిష్ణోయ్ ప్రదర్శనపై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో మొదటి సారి టీమిండియాలో అడుగుపెట్టినప్పుడు తాను ఎదుర్కొన్న అనుభవాలను రవి బిష్ణోయ్ తాజాగా వెల్లడించాడు.
భయమేసింది
తాను తొలి సారి టీమిండియాతో కలిసే సమయంలో భయపడ్డానని, ఎంతో కంగారుగా అనిపించిందని యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తెలిపాడు. భారత జట్టు తరఫున ఆడాలని ప్రతి ఒక్కరు కలలు కంటారని, అలాగే తాను కూడా కన్నట్లు రవి చెప్పుకొచ్చాడు. ఇక చివరకు టీమిండియాలో అవకాశం వచ్చి, జట్టుతో కలిసే సమయంలో ఎంత ఆనందపడ్డానో, అంతే కంగారు కూడా పడ్డానని తెలిపాడు. ఇక ప్రాక్టీసు చేయడానికి జట్టుతో కలిసి వెళ్లినప్పడు, అక్కడ అందరూ సీనియర్ల ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తనకు స్వాగతం పలికాడని చెప్పాడు. అది తనకు చాలా గొప్పగా అనిపించిందని ఈ యువ లెగ్ స్పిన్నర్ ఆనందం వ్యక్తం చేశాడు.

సీనియర్లతో ప్రాక్టీస్ గొప్పగా ఉంది
సీనియర్లందరితో కలిసి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడం తనకు ఎంతో గొప్పగా అనిపించిందని, వారితో కలిసి ప్రాక్టీస్ చేయడాన్ని ఆస్వాదించానని రవి బిష్ణోయ్ చెప్పాడు. అయితే తానింకా చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని, జట్టు విజయం కోసం తన వంతు కృషి చేస్తానని వెల్లడించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేంట్రం సందర్భంగా యజుర్వేంద్ర చాహల్ చేతుల మీదుగా క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్‌లో తన శక్తి మేర బౌలింగ్ చేశానని, అత్యత్తమ ప్రదర్శన ఇవ్వడమే లక్ష్యంగా ఆడానని చెప్పుకోచ్చాడు. దీంతో తాను అనుకున్నట్లుగా సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి పరుగులు రాకుండా కట్టడి చేశానని తెలిపాడు.
రవికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
కాగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఇందులో ఏకంగా 17 డాట్ బాల్స్ ఉండడం గమనార్హం. అంతేకాకుండా ఈ ప్రదర్శనతో రవి బిష్ణోయ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. అటు ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో అధిక్యంలోకి వెళ్లింది.
రవి బిష్ణోయ్ రికార్డులు
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేంట్రం చేసిన ఆరో పిన్న వయస్సుడిగా రవి బిష్ణోయ్ నిలిచాడు. రవి బిష్ణోయ్ వయసు 21 సంవత్సరాల 164 రోజులుగా ఉంది. టీ20 క్రికెట్‌లో అరంగేంట్ర మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొమ్మిదో భారత ఆటగాడిగా రవి బిష్ణోయ్ నిలిచాడు. అలాగే అరంగేంట్రంలోనే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక భారత్‌లో అరంగేంట్రం చేసి అత్యుత్తమ గణాంకాలు నమెదు చేసిన రెండో భారత బౌలర్‌గా రవి బిష్ణోయ్ నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications