వరుణ్ చక్రవర్తి కంటే ఆ స్పిన్నరే బెస్ట్? టీమిండియాలోకి రావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్.. టీ20 ఫార్మాట్లో 200 వికెట్ల మార్కును చేరుకున్న అతి పిన్న వయస్కుడైన భారత బౌలర్‌గా నిలిచాడు. కేవలం 25 ఏళ్ల 211 రోజుల వయస్సులోనే రవి బిష్ణోయ్ ఈ ఘనత సాధించాడు.
ఎలైట్ క్లబ్‌లో చేరిన రవి బిష్ణోయ్
ఈ మైలురాయిని అందుకోవడం ద్వారా రవి బిష్ణోయ్ ఇండియా దిగ్గజ బౌలర్ల సరసన చేరాడు. టీ20ల్లో 200 వికెట్లు తీసిన 19వ భారత బౌలర్‌గా, 9వ స్పిన్నర్‌గా రికార్డుకెక్కాడు. గతంలో యుజ్వేంద్ర చాహల్ (336), పీయూష్ చావ్లా (302), రవిచంద్రన్ అశ్విన్ (301) వంటి స్టార్ ప్లేయర్లు మాత్రమే ఈ జాబితాలో ముందున్నారు. అంతర్జాతీయ స్థాయిలో చూస్తే అతి తక్కువ వయస్సులో ఈ ఘనత సాధించిన రికార్డు రషీద్ ఖాన్ (23 ఏళ్ల 119 రోజులు) పేరిట ఉంది.

గుజరాత్ టైటాన్స్ జట్టుపై అద్భుత స్పెల్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రవి బిష్ణోయ్ తన స్పిన్ మాయాజాలంతో గుజరాత్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీయడం ద్వారా 200వ వికెట్ మార్కును చేరుకున్నాడు.ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా వంటి కీలక వికెట్లు పడగొట్టాడు.
రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ విజయం
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 210 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 204 పరుగులకే పరిమితమైంది. రవి బిష్ణోయ్ కీలక సమయంలో వికెట్లు తీయడంతో రాజస్థాన్ 6 పరుగుల స్వల్ప తేడాతో విజయాన్ని అందుకుంది.
టీమిండియాలోకి రీ-ఎంట్రీ ఖాయమేనా?
ప్రస్తుతం ఐపీఎల్ లో బిష్ణోయ్ చూస్తున్న ఫామ్ చూస్తుంటే.. ఆయనను తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. వరుణ్ చక్రవర్తి కంటే రవి బిష్ణోయ్ మెరుగ్గా రాణిస్తున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు భారత్ తరఫున 44 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రవి బిష్ణోయ్ 64 వికెట్లు తీశాడు. ఈ తాజా ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications