Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్‌గా ఆట‌గాళ్ల‌కు కుంబ్లే అండ‌గా లేడ‌ని కోహ్లీ భావించాడు.. శెట్టి ఆస‌క్తిర విష‌యాలు

Ratnakar shetty Intresting Comments his in Book On Kohli and Kumble Insident

టీమిండియా స్పిన్ దిగ్గ‌జం అనిల్ కుంబ్లే 2017లో భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవ‌డానికి గ‌ల ఆసక్తిర విష‌యాల‌ను టీమిండియా మాజీ మెనేజ‌ర్ ర‌త్నాక‌ర్ శెట్టి వివ‌రించారు. ఆయ‌న రాసిన 'On Board: Test.Trial.Triumph. My years in BCCI' అనే పుస్తకంలో శెట్టి ఈ విష‌యాల గురించి చెప్పుకొచ్చారు. అనిల్ కుంబ్లే జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌కు అండ‌గా ఉండ‌డం లేద‌ని, డ్రెస్సింగ్ రూంలో ఇబ్బందికర ప‌రిస్థితులు సృష్టిస్తున్నాడ‌ని అప్ప‌టి కెప్టెన్ విరాట్ కోహ్లీ భావించిన‌ట్లు ఆ పుస్తకంలో శెట్టి తెలిపారు. 2016 మే నెల‌లో ఐపీఎల్‌లో వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన ఓ మ్యాచ్‌కు తాను హాజ‌రు కాగా అక్క‌డ స‌చిన్ టెండూల్క‌ర్, వీరేంద్ర సెహ్వాగ్ త‌న‌ను క‌లిసిన‌ట్లు చెప్పారు. ఆ స‌మ‌యంలో టీమిండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని త‌న‌కు బీసీసీఐ క్రికెట్‌ ఆపరేషన్స్‌ జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ సూచించాడని సెహ్వాగ్ త‌న‌తో చెప్పాడ‌ని శెట్టి తెలిపారు.

అది జ‌రిగిన కొన్ని రోజుల తర్వాత తాను ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌కు వెళ్లాన‌ని చెప్పారు. అక్కడ జ‌రిగిన సీఓఏ మీటింగ్‌లో కమిటీ సభ్యులు వినోద్‌ రాయ్‌, డయానా ఎడల్జీతో పాటు తాను, అనిల్‌ కుంబ్లే, విరాట్‌ కోహ్లీ వర్చువల్‌గా సమావేశమైన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆ సమావేశంలో టీమ్‌ఇండియా కోచ్‌గా కుంబ్లేనే కొనసాగిద్దామని వినోద్ రాయ్ చెప్పార‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. దాంతో తాను, కుంబ్లే షాకయ్యామ‌ని శెట్టి చెప్పుకొచ్చారు. ఆ త‌ర్వాత‌ అంతకుముందు సెహ్వాగ్ త‌న‌తో చెప్పిన విషయాన్ని కుంబ్లేకు చెప్ప‌టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. దీంతో సెహ్వాగ్ చెప్పింది అవాస్త‌మ‌ని అర్థ‌మైన‌ట్టు త‌న పుస్త‌కంలో రాసుకొచ్చారు.

IPL 2022 Mega Auction : Virat Kohli About His First Salary In Debut IPL | Oneindia Telugu

అయితే అప్ప‌టి కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లే ఆలోచ‌నా విధానం వేర్వేరుగా ఉండేద‌ని అన్నారు. దీంతో కుంబ్లేను హెడ్ కోచ్‌గా కొన‌సాగించ‌డానికి ప‌లువురు ఇష్ట‌ప‌డ‌లేద‌ని అనిపించింద‌ని శెట్టి తెలిపారు. ఇక 2017 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ, కుంబ్లే, శ్రీధర్‌ పలువురు బీసీసీఐ పెద్దలు సమావేశ‌మ‌య్యార‌ని ఆయ‌న చెప్పారు. ఆ స‌మావేశంలో కుంబ్లేపై కోహ్లీ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు ప‌రోక్షంగా చెప్పారు. ఇక ఆ ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో టీమిండియా ఓడిపోయింద‌ని గుర్తు చేసుకున్నాడు. అనంత‌రం అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్‌కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నాడ‌ని ర‌త్నాక‌ర్ శెట్టి త‌న పుస్తకంలో రాసుకొచ్చాడు.

Story first published: Saturday, February 5, 2022, 14:38 [IST]
Other articles published on Feb 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+