న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రష్మిక మందన్నా ఫెవరెట్‌ ఐపీఎల్ టీమ్‌ అదే.. ఫాన్స్ ఫుల్ ఖుషీ! అది తప్పా ఇంకేదైనా అడగండి అంటూ షాక్!

Rashmika Mandana reveales her favorite IPL team is RCB
IPL 2021 : Rashmika Mandanna ఈ సాలా కప్‌ నమ్‌దే RCB Fans In Awe..!! || Oneindia Telugu

హైదరాబాద్: తన అందం, నటనతో అభిమానులను కట్టి పడేస్తుంటారు రష్మిక మందాన్న. సీరియస్ పాత్ర చేసినా, అల్లరి పాత్రలు పోషించినా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటారు. చలో, గీత గోవిందం సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యారు. ప్రస్తుతం వరుసగా అగ్రహీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఆమె నేషనల్ స్టార్. ప్రస్తుతం రష్మిక టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టీవ్‌గా ఉండే రష్మిక.. సోమవారం మధ్యాహ్నం లైవ్‌లొకి వచ్చారు. చాలా రోజుల తరువాత రష్మిక లైవ్‌లోకి రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

PBKSvsRCB:12 బంతుల్లోనే 40 రన్స్.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌కు కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్! వచ్చే మ్యాచుకు డౌటే?PBKSvsRCB:12 బంతుల్లోనే 40 రన్స్.. పర్పుల్ క్యాప్ హోల్డర్‌కు కోహ్లీ స్ట్రాంగ్ వార్నింగ్! వచ్చే మ్యాచుకు డౌటే?

ఈ సాలా కప్‌ నమ్‌దే:

ఈ సాలా కప్‌ నమ్‌దే:

కరోనా వైరస్ ఉదృతమవుతున్న వేళ సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ పడడంతో ..రష్మిక మందన్నా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ సంబరపడిపోవడమే కాకుండా తమ కోరికల చిట్టాను బయటపెట్టేశారు. ఈ సందర్భంగా ఒక అభిమాని ఆమెను ఐపీఎల్‌లో మీ ఫెవరెట్‌ టీమ్‌ ఏది అని అడిగాడు. దానికి రష్మిక.. 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అంటూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తన ఫెవరెట్‌ అని చెప్పారు. దీంతో ఆర్‌సీబీ ఫాన్స్ తెగ సంబరపడిపోయారు. యూఏఈ వేదికగా గతేడాది జరిగిన ఐపీఎల్‌​ సీజన్‌కు ఆర్‌సీబీ 'ఈ సాలా కప్‌ నమ్‌దే' అనే స్లోగన్‌తో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆర్‌సీబీ ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా టైటిల్‌ కొట్టలేకపోయింది. అయినా సరే ఆర్‌సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ చాలా ఎక్కువ.

అది మాత్రం చూపించను:

అది మాత్రం చూపించను:

రష్మిక మందన్నా ఓ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేశారు. ఓ పాట పాడమని అడగ్గా.. పాట తప్పా ఇంకేదైనా అడగండి చేస్తాను. కావాలంటే డ్యాన్స్ చేస్తాను కానీ పాట మాత్రం పాడను. నేను పాడితే అందరూ లైవ్ నుంచి పారిపోతారు. మిమ్మల్ని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు' అని బదులిచ్చారు. ఒక్కసారి ఇళ్లు మొత్తం చూపించండని ఓ నెటిజన్ అడగ్గా.. అందుకు కూడా ఆమె నిరాకరించారు. 'ఇళ్లు మాత్రం చూపించను. అలాంటివి నాకు నచ్చదు. హోం టూర్ అంటే నచ్చదు. ఇక నేను శుభ్రంగా కూడా ఉంచుకోను. చాలా చెత్తగా ఉంది నా ఇళ్లు. ఇప్పుడు చూపించలేను.. సారీ' అంటూ రష్మిక తప్పించుకున్నారు.

ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందేమో:

ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందేమో:

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు గతేడాది ఫ్లేఆఫ్‌ వరకు వెళ్లి ఇంటి బాట పట్టింది. లీగ్ మ్యాచుల్లో అద్భుత ప్రదర్శన చేసిన కోహ్లీ సేన.. కీలకమైన ఫ్లేఆఫ్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఐపీఎల్‌ 2021 సీజన్‌ను మాత్రం ఆర్‌సీబీ ఘనంగా ఆరంభించింది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు.. రెండు ఓటములతో పట్టికలో మూడో స్థానంలో ఉంది. విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌ దూకుడుగా ఆడుతున్నారు. ప్రతీసారి టైటిల్‌ ఫెవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగే ఆర్‌సీబీ ఈసారైనా టైటిల్‌ సాధిస్తుందేమో చూడాలి.

34 పరుగుల తేడాతో ఓటమి:

34 పరుగుల తేడాతో ఓటమి:

గత రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులుచేసింది. ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో విరాట్ కోహ్లీ (35), రజత్ పాటిదార్‌ (31), హర్షల్‌ పటేల్‌ (27) పరుగులు చేశారు. అంతకుముందు పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (91 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

Story first published: Saturday, May 1, 2021, 11:19 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X