For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్సర్లతో రెచ్చిపోయిన రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా.. చివరి బంతికి గుజరాత్ అద్భుత విజయం

rashidh khan and rahul tewatia super finishing helps to gujarat titans a thrilling victory at last ball

చివరి ఓవర్లో 22పరుగులు కావాల్సిన తరుణంలో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా రెచ్చిపోయారు. మార్కో జాన్సేన్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి రాహుల్ తెవాతీయా లాంగ్ ఆన్లో సిక్సర్ బాదాడు. 2వ బంతికి సింగిల్ వచ్చింది. 3వ బంతికి రషీద్ క్రీజులోకి వచ్చాడు. ఆ బంతికి రషీద్ స్ట్రెయిట్ సిక్స్ బాదాడు. 4వ బంతికి డాట్ పడింది. ఇక 2బంతుల్లో 9పరుగులు కావాల్సిన తరుణంలో రషీద్ మ్యాజిక్ చేశాడు. 5వ బంతికి మార్కో జాన్సేన్ ఫుల్ టాస్ వేయగా.. దాన్ని ఆఫ్ సైడ్ సిక్సర్‌గా మలిచాడు. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన తరుణంలో షార్ట్ పిచ్ బంతి పడగా రషీద్ బ్యాట్‌కు ఎడ్జ్ అయ్యి బంతి నేరుగా బౌండరీ అవతల పడింది. దీంతో గుజరాత్ డగౌట్లో సంబరాలు మిన్నంటాయి.

5వికెట్ల తేడాతో గుజరాత్ విజయం..

5వికెట్ల తేడాతో గుజరాత్ విజయం..

ఐపీఎల్ 2022 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన సన్ రైజర్స్ అభిషేక్ శర్మ (65పరుగులు 42బంతుల్లో 6ఫోర్లు 3సిక్సర్లు), మార్క్రామ్ (56పరుగులు 40బంతుల్లో 2ఫోర్లు 3సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. చివర్లో శశాంక్ సింగ్ (25పరుగులు 6బంతుల్లో 1ఫోర్, 3సిక్సర్లు) రాణించడంతో 20ఓవర్లకు 6వికెట్లు కోల్పోయి 195పరుగులు చేసింది. ఇక ఛేదనకు దిగిన గుజరాత్‌ ఓపెనర్ సాహా (68పరుగులు 38బంతుల్లో 11ఫోర్లు 1సిక్సర్లు), శుభ్‌మన్ (22) రాణించగా.. చివర్లో రాహుల్ తెవాతీయా (40పరుగులు 21బంతుల్లో 4ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్), రషీద్ ఖాన్ (31పరుగులు 11 బంతుల్లో 4సిక్సర్లు నాటౌట్ ) చెలరేగడంతో గుజరాత్ చివరి బంతికి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఛేదనలో గుజరాత్‌కు శుభారంభం లభించింది. ఓపెనర్ సాహా (65పరుగులు 42బంతుల్లో) రెండో ఓవర్ నుంచే తన దూకుడు మొదలెట్టాడు. జాన్సేన్ వేసిన రెండో ఓవర్లో ఫోర్, సిక్సర్ కొట్టగా ఆ ఓవర్లో వైడ్ ఫోర్‌తో కలుపుకుని 18పరుగులు వచ్చాయి. తర్వాతి భువీ బౌలింగ్లోనూ రెండు ఫోర్లు కొట్టాడు. ఇక 3ఓవర్ నుంచి శుభ్ మన్ గిల్ కూడా సాహాతో పాటు అటాక్ ప్రారంభించడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది. కేవలం 5.2 ఓవర్లలోనే 50పరుగుల భాగస్వామ్యాన్ని ఈ ఓపెనింగ్ జోడీ నమోదు చేసింది. ఈ క్రమంలో నటరాజన్ వేసిన ఆరో ఓవర్లో ఫోర్ బాదిన సాహా ఐపీఎల్ చరిత్రలో 200వ ఫోర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో చేరాడు. వీరిద్దరి జోడీ ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో సన్‌రైజర్స్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఎస్ఆర్‌హెచ్‌కు బ్రేక్ ఇచ్చాడు. శుభ్ మన్ గిల్‌ (22పరుగులు)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 69పరుగుల వీరి భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా(10)ను తన తర్వాతి స్పెల్‌లో ఉమ్రాన్ క్యాచ్ ఔట్ చేశాడు. 11ఓవర్లో సాహా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత సాహా అటాక్ కొనసాగింది.

 153కిమీల వేగంతో బంతి.. సాహా క్లీన్ బౌల్డ్

153కిమీల వేగంతో బంతి.. సాహా క్లీన్ బౌల్డ్

ఇక మళ్లీ మిల్లర్‌తో కలిసి లక్ష్యం దిశగా ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్న సాహాను ఉమ్రాన్ మాలిక్ పెవిలియన్ పంపాడు. 153కి.మీల వేగంతో వేసిన యార్కర్‌కు సాహా(68పరుగులు) దగ్గర ఎలాంటి సమాధానం లేకపోయింది. క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత మిల్లర్ (17), అభినవ్ మనోహర్ (0)లను కూడా ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేసి తన కెరీర్లోనే తొలి 5వికెట్ హౌల్ సాధించాడు.

చివర్లో రెచ్చిపోయిన రషీద్ ఖాన్, తెవాతీయా

చివర్లో రెచ్చిపోయిన రషీద్ ఖాన్, తెవాతీయా

ఇక చివర్లో రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా రెచ్చిపోయారు. ఆకాశమే హద్దుగా బౌండరీలతో విరుచుకుపడ్డారు. 16ఓవర్లు పూర్తయ్యే సరికి 5వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ ఆ సమయంలో గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆ టైంలో రషీద్ ఖాన్, రాహుల్ తెవాతీయా క్రీజులో ఉన్నారు. 24బంతుల్లో 56పరుగులు చేయాల్సిన తరుణంలో వీరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వీరి బ్యాటింగ్ దూకుడుకు నట్టూ, భువీ తేలిపోయారు. ఇక చివరి ఓవర్లో 6బంతుల్లో 22పరుగులు కావాల్సిన తరుణంలో మార్కో జాన్సేన్ బౌలింగ్‌కు దిగాడు. ఇక ఆ ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాదిన తెవాతీయా తర్వాతి బంతికి సింగిల్ తీయడంతో రషీద్ క్రీజులోకి చేరాడు. చివరి 4బంతుల్లో 3సిక్సర్లు బాదిన రషీద్.. అదిరిపోయే విజయాన్ని‌గుజరాత్ కు అందించాడు. ఈ మ్యాచ్‌తో 14పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ టేబుల్ టాపర్ గా తన స్థానాన్ని నిలుపుకోగా.. సన్ రైజర్స్ 10పాయింట్లతో 3వ స్థానంలో కొనసాగుతుంది.

వణికించిన ఉమ్రాన్ మాలిక్..

వణికించిన ఉమ్రాన్ మాలిక్..

ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగే బంతులతో గుజరాత్ బ్యాటర్లను గజగజ వణికించాడు. క్రీజులో నిలబడాలంటేనే తత్తరపడిపోయేలా తన బుల్లెట్ల లాంటి బంతులతో రెచ్చిపోయాడు. వరుసగా తను వేసిన ఓవర్లలో వికెట్లు తీస్తూ సన్‌రైజర్స్ వైపు మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ క్రమంలో అత్యంత వేగవంతమైన (153కి.మీల) బంతిని విసిరి గుజరాత్ బ్యాటర్ సాహాను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ క్రమంలో తన తొలి 5వికెట్ల హౌల్ సాధించాడు. అతను తీసిన 5వికెట్లలో నాలుగు క్లీన్ బౌల్డ్ కావడం విశేషం. హార్దిక్ పాండ్యా క్యాచ్ ఔట్ కాగా.. గిల్, సాహా, మిల్లర్, అభినవ్ మనోహర్ బౌల్డ్ అయ్యారు. ఈ క్రమంలో తన అత్యుత్తమ బౌలింగ్ (4-0-5-25) ప్రదర్శన చేశాడు.

పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవార్డులు

పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ అవార్డులు

పంచ్ సూపర్ స్ట్రైకర్ : రషీద్ ఖాన్

డ్రీమ్ 11 గేమ్ ఛేంజర్ : ఉమ్రాన్ మాలిక్

క్రాకింగ్ సిక్సెస్ : రషీద్ ఖాన్

పవర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ : సాహా

మోస్ట్ వాల్యుబుల్ అస్సెట్ : సాహా

ఫాస్టెస్ట్ డెలివరీ : ఉమ్రాన్ మాలిక్

ఆన్ ధి గో ఫోర్స్ ఆఫ్ ది మ్యాచ్ : సాహా

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ : ఉమ్రాన్ మాలిక్ (5-25)

Story first published: Wednesday, April 27, 2022, 23:59 [IST]
Other articles published on Apr 27, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+