Rashid Latif: పాక్ చేతిలో ఓటమితో టీమిండియాకు భారీ డ్యామేజీ జరిగింది.. కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది

ఆగస్టు 28న ఆసియా కప్ టోర్నీలో భాగంగా టీమిండియా పాకిస్థాన్‌తో తలపడనుంది. గతేడాది టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడినప్పుడు బాబర్ ఆజామ్ సారథ్యంలోని పాక్ జట్టు 10వికెట్ల తేడాతో గెలుపొందింన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇరు జట్లు తలపడడం ఇదే తొలిసారి. భారత్‌పై విజయంతో పాకిస్తాన్ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఆ జట్టు ఖంగుతింది. ఇకపోతే భారత్ గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీకి రాజీనామా చేయడం.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికవ్వడం జరిగిన సంగతి తెలిసిందే. రోహిత్ నేతృత్వంలో భారత్ టీ20ల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. జట్టులోనూ గణనీయమైన మార్పులొచ్చాయి. అలాగే చాలా మంది కొత్తవాళ్లను కూడా టీంలో ప్రయోగించారు. ఏదేమైనా టీ20 ప్రపంచకప్ సందర్భంగా పాకిస్థాన్ దెబ్బకు 10వికెట్ల తేడాతో ఓడిపోయిన ఇండియా టీంకు భారీ డ్యామేజీ జరిగిందని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ అభిప్రాయపడ్డాడు.

టీమిండియాకు పెద్ద ఇంపార్టెంట్ కాదేమో..!
రషీద్ లతీఫ్ ఇంకా మాట్లాడుతూ.. 'టీ20 ప్రపంచకప్‌కు టీమిండియాకు పెద్ద ఇంపార్టెంట్ విషయంలాగా అనిపించలేదు. అన్ని సిరీస్ల మాదిరిగానే అది కూడా ఓ సిరీస్‌లా భారత్ మేనేజ్ మెంట్ తీసుకుంటున్నట్లుంది. ఎందుకంటే ప్రతి సిరీస్‌కు జట్లలో విపరీతంగా మార్పులు జరుగుతుండడం వల్ల అలా అనిపిస్తుంది. వారి దృష్టి ప్రస్తుతం ఆసియా కప్‌పైనే ఉంది. టీ20 ప్రపంచకప్ టైంలో పాకిస్తాన్‌తో ఓటమి భారత జట్టుకు చాలా డ్యామేజీ కలిగించింది. కాబట్టి ఆ ఓటమి నుంచి టీమిండియా కోలుకోవడానికి ప్రయత్నిస్తుంది.' అని లతీఫ్ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్ 'క్యాట్ బిహైండ్'లో చెప్పారు.

చాలా శ్రద్ధ చూపుతుందేమో..!
'ఇప్పుడడే సిరీస్‌ల అన్నింటికంటే.. భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా ముఖ్యమైంది. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ గురించి భారత జట్టు, బోర్డు, మేనేజ్‌మెంట్ చాలా శ్రద్ధ చూపుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టీమిండియా ఆసియా కప్‌ను గెలవాలని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ఒకవేళ ఆ జట్టులోని స్టార్ ఆటగాళ్లందరూ అందుబాటులో ఉంటే ఆ జట్టే టైటిల్ ఫేవరెట్‌గా ఉంటుంది.' అని లతీఫ్ పేర్కొన్నాడు.

గెలుపు విషయంలో పాకే బెటరేమో..!
గత కొన్నేళ్లుగా పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్‌లలో పాక్‌పై భారత్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ.. చివరి మ్యాచ్‌లో మట్టుకు 10వికెట్ల భారీ తేడాతో విజయం సాధించడం బాబర్ ఆజామ్ నేతృత్వంలోని పాక్ జట్టుకు మంచి విజయోత్సాహాన్ని ఇస్తుందని లతీఫ్ అన్నాడు. యుఏఈలో పాక్‌కు అనుకూలంగా పరిస్థితులుంటాయి. పాకిస్థాన్ గెలవడానికి స్వల్ప ఎడ్జ్ ఉంటుందని పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications