Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రాహుల్ ద్రవిడ్ క్రికెట్‌ కోసమే పుట్టాడు: రషీద్‌ లతీఫ్‌

Rashid Latif recalls Rahul Dravid’s dismissal in

కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్ రాహుల్‌ ద్రవిడ్‌ క్రికెట్‌ కోసమే పుట్టాడని పాకిస్థాన్‌ మాజీ ఆటగాడు రషీద్‌ లతీఫ్‌ అన్నాడు. అండర్‌-19, భారత్‌-ఏ జట్లను 'ది వాల్‌' తీర్చిదిద్దాడని వెల్లడించాడు. పాక్ మాజీ కెప్టెన్ యూనిస్‌ ఖాన్‌ ఎదుగుదలకు కూడా ద్రవిడ్ సహాయం చేశాడని లతీఫ్‌ చెప్పాడు. లతీఫ్ పాక్ తరపున 37 టెస్టులు, 166 వన్డేలు ఆడాడు.

ద్రవిడ్ క్రికెట్‌ కోసమే పుట్టాడు:

ద్రవిడ్ క్రికెట్‌ కోసమే పుట్టాడు:

తాజాగా రషీద్‌ లతీఫ్‌ కాట్‌ బిహైండ్‌ యూట్యూబ్‌ షోలో మాట్లాడుతూ... 'రాహుల్ ద్రవిడ్‌ అద్భుతమైన వ్యక్తి. సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతడి సూచనలు, మార్గదర్శకత్వం తనలోని అత్యుత్తమ ఆటతీరును ఎలా బయటపెట్టాయో యూనిస్‌ ఖాన్‌ సైతం నాతో చెప్పాడు. రాహుల్‌ది గొప్ప క్రికెట్‌ మెదడు. అతడు క్రికెట్‌ ఆడేందుకే పుట్టాడు. భారత్‌-ఏ, అండర్‌-19 జట్లను అభివృద్ధి చేశాడు. ఎందరో ఆటగాళ్లు జాతీయ జట్టులోకి వచ్చారు. అందుకే అతడు క్రికెట్‌ కోసమే పుట్టాడని నేను అంటున్నా' అని పేర్కొన్నాడు.

నేను ఔటయ్యానా?:

నేను ఔటయ్యానా?:

1996లో షార్జా వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్‌ ఔటవ్వడం గురించి రషీద్‌ లతీఫ్‌ గుర్తుచేసుకున్నాడు. మ్యాచ్‌ ముగిశాక 'నేను ఔటయ్యానా?' అని రాహుల్‌ తనను ప్రశ్నించగా.. 'లేదు సోదరా' అని లతీఫ్‌ బదులిచ్చాడట. 'షార్జా వేదికగా భారత్ మాతో వన్డేలో తలపడింది. ద్రవిడ్ షాట్ ఆడగా.. ‌ కీపర్‌ చేతికి చిక్కాడు. బంతి వేయగానే.. బౌలర్‌ ముస్తాక్‌ అహ్మద్‌ బిగ్గరగా అప్పీల్‌ చేశాడు. మేమూ కూడా అరిచాం. దాంతో అంపైర్‌ ఔటిచ్చాడు. 'నేను ఔటయ్యానా' అని మ్యాచ్‌ ముగిశాక ద్రవిడ్‌ నన్ను అడిగాడు. 'లేదు సోదరా. అలా అప్పీల్‌ చేయడం ముస్తాక్‌ అలవాటు' అని బదులిచ్చా' అని లతీఫ్‌ తెలిపాడు.

సచిన్‌ ఔట్‌ అవ్వాలని కోరుకునేవాడిని కాదు:

సచిన్‌ ఔట్‌ అవ్వాలని కోరుకునేవాడిని కాదు:

సచిన్‌ టెండూల్కర్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో అతడు ఔటవ్వాలని తన మనసు ఎప్పుడూ కోరుకోలేదు అని ఇటీవల రషీద్ లతీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'నేను వికెట్ కీపర్‌గా ఉన్నప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు బ్యాటింగ్ చేసేవారు. సచిన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం అతడు ఔట్ అవ్వాలని నా మనసు ఎప్పుడూ కోరుకోలేదు. నేను కీపింగ్ చేసేప్పుడు కూడా అతడి బ్యాటింగ్‌ను ఇష్టంగా చూసేవాడిని. టీవీలో కంటే స్టంప్స్‌ వెనక నిలబడి ఉన్నప్పుడే ఎక్కువ ఆస్వాదించేవాడిని' అని లతీఫ్ తెలిపాడు.

సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని:

సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని:

'ఆటగాళ్లు ఇన్నింగ్స్‌ అడతారు, వెళ్తారు. కానీ..మీ ప్రవర్తనను గుర్తుంచుకోవాలి. మైదానంలో మంచి వ్యక్తిత్వంతో మెలిగే వాళ్ల జాబితాలో సచిన్ ముందునిలుస్తాడు. అలాంటి వారు మీ జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. అనేక మంది ఆటగాళ్లు సచిన్‌ను ఆదర్శంగా తీసుకొని క్రికెట్‌ను వృత్తిగా ఎంచుకున్నారు' అని లతీఫ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, May 30, 2020, 18:02 [IST]
Other articles published on May 30, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+