రషీద్‌ఖాన్‌ను ఉతికి ఆరేసిన వాట్సన్: మ్యాచ్ హైలెట్స్, మీమ్స్ ఇవే!

హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆటగాడు షేన్ వాట్సన్ 53 బంతుల్లో 96 (9 ఫోర్లు, 6 సిక్సర్లు) రాణించడంతో చెన్నై సూపర్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో సీఎస్‌కే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడంతో పాటు ఈ సీజన్‌లో ఫ్లే ఆఫ్ బెర్త్ సొంతం చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
రషీద్‌ను ఉతికి ఆరేసిన షేన్ వాట్సన్
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కీలక బౌలర్ రషీద్ ఖాన్‌ను షేన్ వాట్సన్ ఉతికి ఆరేశాడు. ఈ సీజన్‌లో రషీద్ ఖాన్ అత్యధికంగా పరుగులు సమర్పించుకున్న మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఒకానొక సమయంలో తీవ్ర అసహనానికి గురైన రషీద్ ఖాన్... వాట్సన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీదికి కూడా దూసుకెళ్లాడు. అయితే, వాట్సన్ కామ్‌గా క్రీజులోకి వెళ్లడంతో ఇద్దరి మధ్య ఏం జరగలేదు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 4 ఓవర్లు వేసి 44 పరుగులు సమర్పించుకున్నాడు. రషీద్ ఖాన్-షేన్ వాట్సన్‌ల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌తో పాటు కామెంట్స్, జోకులు పేల్చుతున్నారు.
ధోనికి ధన్యవాదాలు తెలిపిన వాట్సన్
కాగా, మ్యాచ్ అనంతరం షేన్ వాట్సన్ సీఎస్‌కే జట్టు కోచ్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీలకు ధన్యవాదాలు తెలిపాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకుంటూ "మంచు కురువడం వల్లే నేను పరుగులు చేశాను. మా కోచ్ స్టిఫెన్ ప్లెమింగ్, కెప్టెన్ ఎంఎస్ ధోని థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను. నేను చాలా జట్లకు ఆడాను. ప్రస్తుత పరిస్థితే ఉంటే ఏ జట్టు నాకు అవకాశం ఇచ్చేది కాదు. కానీ ఫ్లెమింగ్,ధోని నాపై విశ్వాసం ఉంచి అవకాశం ఇచ్చారు" అని అన్నాడు.
టీ20ల్లో ఎనిమిది వేల పరుగులు
ఈ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీ20ల్లో ఎనిమిది వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications