Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్పిన్‌తో తిప్పేసిన రషీద్: బంగ్లాతో ఏకైక టెస్టులో ఆప్ఘన్ భారీ విజయం

Rashid Khan spins Afghanistan to famous Test triumph over Bangladesh

హైదరాబాద్: బంగ్లాదేశ్‌కు పసికూన ఆప్ఘనిస్థాన్ షాకిచ్చింది. చొట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఆప్ఘనిస్థాన్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. టెస్టు క్రికెట్‌లో ఆప్ఘనిస్థాన్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం. గతేడాది టెస్టు హోదా పొందిన తర్వాత టీమిండియాతో ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ఆప్ఘనిస్థాన్ ఆ తర్వాత ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఆడిన మూడు టెస్టుల్లోనే ఆప్ఘనిస్థాన్ రెండు టెస్టుల్లో విజయం సాధించడం విశేషం. టెస్టులో కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డు సాధించిన రషీద్ ఖాన్ ఈ మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 11 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్ ఖాన్

తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్ ఖాన్

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రషీద్ ఖాన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఆఖరి రోజైన సోమవారం 17.2 ఓవర్లలోనే బంగ్లాదేశ్ మిగతా నాలుగు వికెట్లు కోల్పోయి 173 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఈ మ్యాచ్‌లో 224 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ 117 ఓవర్లకుగాను 342 పరుగులు చేసి ఆలౌటైంది. ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో రహ్మాత్ షా(102) సెంచరీతో చెలరేగగా... అప్ఘర్(92) తృటిలో సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 70.5 ఓవర్లకు గాను 205 పరుగులకే కుప్పకూలింది.

397 పరుగుల విజయ లక్ష్యం

397 పరుగుల విజయ లక్ష్యం

బంగ్లా బ్యాట్స్‌మెన్లలో మొమినుల్(52), మొసాదెక్(48) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పెవిలియన్‌కు చేరారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆప్ఘనిస్థాన్ 137 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ 260 పరుగులు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు 397 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

చెలరేగిన రషీద్ ఖాన్

చెలరేగిన రషీద్ ఖాన్

ఆప్ఘన్ స్పిన్నర్లు ఎదుర్కొనలేక రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 173 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో రషీద్ ఖాన్(49/6)తో చెలరేగడంతో బంగ్లా తక్కువ స్కోరుకే పరిమితమైంది. జహీర్ ఖాన్ మూడు వికెట్లు తీయగా... మహ్మద్ నబీ ఒక వికెట్ తీసుకున్నాడు.

స్కోరు వివరాలు

స్కోరు వివరాలు

ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 342

బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: 205

ఆప్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 260

బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్: 173

మ్యాచ్ ఫలితం: 224 పరుగుల తేడాతో ఆప్ఘన్ విజయం

Story first published: Monday, September 9, 2019, 18:32 [IST]
Other articles published on Sep 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+