Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన రికార్డు నెలకొల్పిన రషీద్ ఖాన్

Rashid Khan set to become youngest captain in international cricket

హైదరాబాద్: ఆప్ఘన్ లెగ్ స్పిన్నర్ రషీద్‌ ఖాన్‌ మరో అరుదైన సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కెపెన్టీ బాధ్యతలు చేపట్టిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అప్ఘనిస్థాన్ రెగ్యులర్ కెప్టెన్‌ అస్గర్‌కు కడుపునొప్పి ఆపరేషన్ జరగడంతో అతడి స్థానంలో రషీద్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా భాద్యతలు అప్పగిస్తూ ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది.

దీంతో 19 ఏళ్ల 159 రోజులకే కెప్టెన్‌ బాధ్యతలు స్వీకరించిన పిన్న వయస‍్కుడిగా రషీద్‌ అరుదైన ఘనత సాధించాడు. రషీద్‌ కంటే ముందు బంగ్లాదేశ్ క్రికెటర్ రాజిన్ సలేహ్ తక్కువ వయస్సులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన క్రికెటర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ రికార్డుని రషీద్ బద్దలు కొట్టాడు.

ఇటీవల ఐసీసీ ప్రకటించిన వన్డే, టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌‌లో నెంబర్ వన్ ర్యాంకులో నిలిచిన సంగతి తెలిసిందే. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన పిన్న వయస్కుడిగా కూడా అరుదైన రికార్డు నెలకొల్పాడు. రషీద్ నేతృత్వంలోని ఆప్ఘన్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయిర్‌ టోర్నీలో ఆడనుంది.

టోర్నీలో భాగంగా మార్చి 4వ తేదీన స్కాట్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో క్వాలిఫై అయితే 2019లో జరిగే వరల్డ్ కప్‌కు ఆప్ఘనిస్థాన్ జట్టు అర్హత సాధిస్తుంది. ఆప్ఘన్ తరుపున రషీద్ ఖాన్ ఇప్పటివరకు 37 వన్డేలాడి 86 వికెట్లు, 29 టీ20 మ్యాచ్‌లాడి 47 వికెట్లు తీశాడు.

అంతర్జాతీయ క్రికెట్లో తక్కువ వయస్సులో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వారు:
* రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్తాన్‌)- 19 ఏళ్ల 159 రోజులు
* రాజిన్ సలేహ్ (బంగ్లాదేశ్)- 20 ఏళ్ల 297 రోజులు
* రోడ్నీ ట్రోట్ (బెర్ముడా)- 20 ఏళ్ల 332 రోజులు
* తాటెండా తైబు (జింబాబ్వే)-20 ఏళ్ల 342 రోజులు
* నవాబ్ పటౌడీ (భారత్)-21 ఏళ్ల 77 రోజులు

Story first published: Tuesday, February 27, 2018, 17:34 [IST]
Other articles published on Feb 27, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+