For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్ రెండో పెళ్లి?: సోషల్ మీడియాలో భార్య ఫొటో వైరల్!

Rashid Khan: అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన రెండో పెళ్లి విషయంపై వార్తల్లో నిలిచారు. సోషల్ మీడియాలో ఓ మహిళతో రషీద్ ఖాన్ దిగిన ఫోటో వైరల్ అవుతుండటంతో ఆయన స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా దీనిపై స్పష్టతనివ్వాల్సి వచ్చింది. రషీద్ ఖాన్ ఈ ఏడాది ఆగస్టులోనే వివాహం చేసుకున్నట్లు సమాచారం.

మహిళతో రషీద్ ఖాన్ ఫోటో వైరల్
అఫ్గానిస్థాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్ ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం కారణంగా చర్చనీయాంశంగా మారారు. రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారని వార్తలు వచ్చాయి. దీనికి కారణం ఓ మహిళతో రషీద్ ఖాన్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడమే. సోషల్ మీడియాలో ఈ గందరగోళం పెరగడంతో రషీద్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో దీనిపై వివరణ ఇచ్చారు. ఫొటోలో తన పక్కన ఉన్న మహిళ తన భార్యేనని స్పష్టం చేశారు.

Rashid Khan Second Marriage Viral Photo Sparks Confusion on Social Media

నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక చారిటీ ఈవెంట్ ప్రారంభోత్సవానికి రషీద్ ఖాన్ వెళ్లారు. ఈ కార్యక్రమంలోనే రషీద్‌తో పాటు ఆ మహిళ కూడా కనిపించారు. ఈ ఫొటో బయటకు రాగానే రకరకాల చర్చలు మొదలయ్యాయి. దాంతో రషీద్ ఖాన్ స్వయంగా ఆమె తన భార్య అని ప్రపంచానికి తెలియజేశారు. అయితే ఆమె ఆయన రెండో భార్యా? అనే విషయంలో గందరగోళం కొనసాగుతోంది.

రషీద్ ఖాన్ తన వైరల్ ఫొటోపై ఇచ్చిన వివరణ కారణంగానే ఈ గందరగోళం మరింత పెరిగింది. తన పోస్ట్‌లో రషీద్ ఖాన్ ఇలా రాసుకొచ్చారు. "2 ఆగస్టు 2025న నా జీవితంలో కొత్త ప్రారంభం జరిగింది. నాకు నిఖా జరిగింది. నేను ఎల్లప్పుడూ కోరుకునే ప్రేమ, శాంతి, భాగస్వామ్యాన్ని సూచించే ఒక మహిళను వివాహం చేసుకున్నాను. నేను ఇటీవల నా భార్యను ఒక ఛారిటీ ఈవెంట్‌కు తీసుకువెళ్లాను, కానీ దురదృష్టవశాత్తు దీని గురించి ప్రజలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే నిజం ఏమిటంటే, ఆమె నా భార్య, ఇది దాచాల్సిన విషయం కాదు." అని రషీద్ ఖాన్ పేర్కొన్నారు.

గందరగోళానికి కారణం ఇదే..
రషీద్ ఖాన్ తన పోస్ట్‌లో తన వివాహ తేదీని 2 ఆగస్టు 2025 అని పేర్కొన్నారు. అయితే గత సంవత్సరం (అంటే 2024) అక్టోబర్ 3న అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పఖ్తూన్ సంప్రదాయాల ప్రకారం రషీద్ పెళ్లి జరిగింది. రషీద్‌తో పాటు ఆయన ముగ్గురు సోదరులకు కూడా అదే రోజు పెళ్లి జరిగింది. ఆ వివాహ వేడుకలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టులోని పలువురు క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. రషీద్ స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అక్టోబర్ 2024లో ఆయన పెళ్లి జరిగినప్పటికీ.. ఇప్పుడు ఆగస్ట్ 2025 గురించి పేర్కొనడం, ఆ తర్వాత ఒక మహిళతో కనిపించడం వల్ల, రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

Story first published: Wednesday, November 12, 2025, 9:46 [IST]
Other articles published on Nov 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+