DC vs SRH: తల్లిదండ్రులను కోల్పోయి ఏడాదిన్నరగా నరకం అనుభవించా.. రషీద్ ఖాన్ భావోద్వేగం!

IPL 2020,DC vs SRH : Lost My Mother 3-4 Months Ago, Rashid Khan Gets Emotional

అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ స్పిన్నర్, అఫ్గాన్ సెన్సేషన్ రషీద్ ఖాన్ తీవ్ర భావోద్వాగానికి గురయ్యాడు. తల్లిదండ్రులను కోల్పోయి గత ఏడాదిన్నరగా నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టి ప్రదర్శనతో చెలరేగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 15 పరుగులతో గెలుపొంది లీగ్‌లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే.

తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ మూడో మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ (3/14) అద్భుత బౌలింగ్‌తో శ్రేయస్ అయ్యర్, శిఖర్ ధావన్, రిషబ్ పంత్‌లను పెవిలియన్ చేర్చి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 నా బలమే అది..

నా బలమే అది..

పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్‌లో రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. గత ఏడాదిన్నర కాలం తనకెంతో కఠినంగా గడిచిందన్నాడు. ముందు తన తండ్రి చనిపోయాడని.. నాలుగు నెలల క్రితం తన తల్లి మరణించిందని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు. ‘నేను ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుంటే మ్యాచ్‌పై ప్రభావం చూపుతా. అందుకే ప్రశాంతంగా ఉంటూ నేను చేయాల్సిన పని చేశా. నా బెసిక్స్‌పై దృష్టి సారించి మ్యాచ్‌ను ఆస్వాదించా. ఎలాంటి బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చు నాకు తెలుసు.

ఈ అవార్డు వారికి అంకితం..

ఈ అవార్డు వారికి అంకితం..

కెప్టెన్ కూడా నాకు అండగా నిలిచాడు. నీకు ఏది మంచి అనిపిస్తే అదే చేయమని ప్రోత్సహించాడు. పరిస్థితులు నాకు అనుకూలంగా లేకుంటేనే నేను కెప్టెన్ సలహా తీసుకుంటా. ఇక గత ఏడాదిన్నరగా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నా. ముందు మా నాన్నను కోల్పోయా. మూడు, నాలుగు నెలల క్రితం అమ్మ కూడా దూరమైంది. ఆమె నాకు పెద్ద ఫ్యాన్. ఈ అవార్డు వారికే అంకితం. ఐపీఎల్‌లో నేను ఏదైనా అవార్డు గెలిస్తే మా అమ్మ నాతో రాత్రంతా మాట్లాడుతూనే ఉండేది'అని రషీద్ భావోద్వేగానికి గురయ్యాడు.

అమ్మా నువ్వే నా సర్వస్వం...

అమ్మా నువ్వే నా సర్వస్వం...

చాలా కాలంపాటు అనారోగ్యంతో బాధపడిన రషీద్ ఖాన్ తల్లి ఈ ఏడాది జూన్ 18న మరణించారు. తన తల్లి కోలుకోవాలని ప్రార్థించడంటూ..రషీద్ ఖాన్ ట్విటర్ వేదికగా అభిమానులను కోరాడు. ఆమె మరణించిన అనంతరం అతను చేసిన ట్వీట్ అందరిని కదిలించింది ‘అమ్మా నువ్వే నా సర్వస్వం. నాకు గతంలో ఇల్లు లేదు నువ్వు ఉన్నావు. నువ్వు లేవని నేను నమ్మలేక పోతున్నాను. నిన్ను ఎప్పటికీ మిస్సవుతాను'అంటూ రషీద్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక 2018 డిసెంబర్ చివర్లో రషీద్ ఖాన్ తండ్రి మరణించాడు. ఆ సమయంలో కూడా రషీద్ తన బాధను వ్యక్తం చేశాడు.

ఆల్‌రౌండ్ షో..

ఆల్‌రౌండ్ షో..

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 రన్స్ చేసింది. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45), బెయిర్ స్టో(48 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 53), కేన్ విలియమ్సన్(26 బంతుల్లో 5 ఫోర్లు 41) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో రబడా (2/21), అమిత్ మిశ్రా (2/35) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులకే పరిమితమైంది. శిఖర్ ధావన్(34), రిషభ్ పంత్(28), హెట్‌మైర్(21) మినహా అంతా విఫలమయ్యారు. హైదరాబాద్ బౌలర్లలో రషీద్ మూడు వికెట్లు తీయగా.. భువీ 2, ఖలీల్, నటరాజన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.

DC vs SRH: రషీద్ ఖాన్ ఈజ్ బ్యాక్.. వాటే స్పెల్!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 30, 2020, 8:35 [IST]
Other articles published on Sep 30, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X