అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ పెళ్లి చేసుకున్నాడు. గురువారం వైభవంగా జరిగిన రషీద్ ఖాన్ పెళ్లి వేడుకకు తన సహచర క్రికెటర్లతో సహా ప్రముఖులు హాజరయ్యారు. అఫ్గానిస్థాన్ వరల్డ్ కప్ గెలిచే వరకు తాను పెళ్లి చేసుకోనని రషీద్ పేర్కొన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 26 ఏళ్ల రషీద్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాడు. తాజాగా ఓ ఇంటివాడయ్యాడు.
పెళ్లి చేసుకున్న రషీద్ ఖాన్‌కు సోషల్ మీడియా వేదికగా శుభాంకాక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లతో పాటు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు. అఫ్గాన్ మరో స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ ట్విటర్ వేదికగా విషెస్ చెప్పాడు. వన్ అండ్ ఓన్లీ కింగ్ రషీద్‌కు జీవితాంతం ప్రేమ, సంతోషం, విజయం కలిసిరావాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.

కాగా, రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ తరఫున అయిదు టెస్టులు, 105 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 106 పరుగులు, 34 వికెట్లు, వన్డే ఫార్మాట్‌లో 1322 పరుగులు, 190 వికెట్లు తీశాడు. ఇక టీ20ల్లో 460 పరుగులు, 152 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల అఫ్గానిస్థాన్ సాధించిన చారిత్రక విజయాల్లో రషీద్‌ది కీలక పాత్ర.
వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి జట్లపై అఫ్గాన్ విజయం సాధించడంలో, ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ను అఫ్గాన్ ఓడించడంలో రషీద్ ప్రధాన పాత్ర. తాజాగా దక్షిణాఫ్రికాపై అఫ్గాన్ తొలి ద్వైపాక్షిక సిరీస్ గెలవడంలోనూ రషీమ్ ముఖ్య భూమిక పోషించాడు.
Scenes outside the hotel which is hosting Rashid Khan's wedding in Kabul. pic.twitter.com/LIpdUYVZcA
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2024
Congratulations to the one and only King Khan, Rashid Khan, on your wedding! Wishing you a lifetime of love, happiness, and success ahead.@rashidkhan_19 pic.twitter.com/fP1LswQHhr
— Mohammad Nabi (@MohammadNabi007) October 3, 2024