Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జట్టుని గెలిపించలేకపోయిన రషీద్ ఖాన్ హ్యాట్రిక్: అడిలైడ్ స్ట్రైకర్స్ ఓటమి

 Rashid Khans 3rd T20 hat-trick in vain as Sydney Sixers beat Adelaide Strikers in BBL clash

హైదరాబాద్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఆప్ఘన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఈ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న రషీద్ ఖాన్ బుధవారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించాడు. అయితే, రషీద్ హ్యాట్రిక్ తీసినప్పటికీ అడిలైడ్ స్ట్రైకర్స్ ఓడిపోయింది.

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో జేమ్స్ విన్సీ(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. అయితే, ఇన్నింగ్స్ 10వ ఓవర్ చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన రషీద్ ఖాన్... ఆ తర్వాత 12వ ఓవర్ తొలి బంతికి హ్యాట్రిక్ తీయడం విశేషం. ఆ తర్వాత డానియేల్ హ్యూస్ వికెట్ తీయడంతో ఈ మ్యాచ్‌లో రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు.

మొత్తం 4 ఓవర్లు పాటు బౌలింగ్ చేసిన రషీద్ ఖాన్ 4 వికెట్లు తీసి 22 పరుగులు ఇచ్చాడు. టీ20ల్లో రషీద్ ఖాన్‌కు ఇది మూడో హ్యాట్రిక్ కావడం విశేషం. అంతకముందు టామ్ కర్రన్(3.4 ఓవర్లలో 4-22) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 135 పరుగులకే కుప్పకూలింది.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 19వ ఓవర్‌లో బర్త్ డే బాయ్ జోష్ హాజెల్ ఉడ్ వరుసగా నాలుగు బౌండరీలు బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, రషీద్ హ్యాటిక్ సాధించిన వీడియోని బీబీఎల్ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది.

ఈ లీగ్‌లో రషీద్ ఖాన్ తన అద్భుతమైన బౌలింగ్‌తో అందరినీ అలరిస్తున్నాడు. ఈ టోర్నీ కోసం రషీద్ ఖాన్ ప్రత్యేకంగా 'కామెల్' బ్యాట్‌ని ఉపయోగిస్తున్నాడు. ఇప్పటికే ఈ బ్యాట్ క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. గత మ్యాచ్‌లో ఈ కామెల్ బ్యాట్‌తో రషీద్ ఖాన్ బౌండరలీ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 8, 2020, 15:51 [IST]
Other articles published on Jan 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+