రషీద్ ఖాన్.. వయస్సు 19.. ప్రదర్శన 30: సైమన్స్

హైదరాబాద్: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరపున ఆడి అద్భుతమైన ప్రదర్శన చేసిన అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్‌ఖాన్‌పై ఆ దేశ క్రికెట్ కోచ్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు ఫిల్ సైమన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'పిట్ట కొంచెం.. కూత ఘనం' అనే చందంలో స్పిన్ మాయాజాలంతో రషీద్ బ్యాట్స్‌మెన్లను తికమకకు గురి చేసి వికెట్లు పడగొట్టేస్తున్నాడు. వయస్సుకు మించిన ప్రదర్శన చేసి చిన్న వయస్సులోనే ఎంతో పేరు సంపాదించుకున్నాడు.
ఆదివారం నుంచి అఫ్గాన్-బంగ్లాదేశ్ మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. అనంతరం జూన్ 14 నుంచి భారత్-అఫ్గాన్ మధ్య ఏకైక టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో సైమన్స్ మాట్లాడుతూ...'19 ఏళ్ల వయస్సు ఉన్న రషీద్ ఖాన్‌లో 30ఏళ్ల ఆటగాడి అనుభవం దాగి ఉంది. అతని నుంచి జట్టు ఏమి ఆశిస్తోందో రషీద్‌కు తెలుసు. అఫ్గాన్ జట్టులో రషీద్ కన్నా చిన్నవాడు ముజీబ్(17 సంవత్సరాలు). భారత్‌తో టెస్టులో వీరిద్దరి ప్రదర్శనపైనే భారీ అంచనాలు ఉన్నాయి.
ఈ ఫార్మాట్‌లో ఆటగాళ్లు ఓర్పుగా ఆడాలి. గత ఏడాది రషీద్ నాలుగు రోజుల మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై మంచి ప్రదర్శన చేశాడు. అతనికి వికెట్లు కూడా దక్కాయి. ఇంగ్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడాడు. అక్కడ వికెట్లు దక్కించుకున్నాడు. ఆదివారం నుంచి అఫ్గాన్-బంగ్లాదేశ్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆ తర్వాత భారత్‌తో ఏకైక టెస్టు ఆడాలి. వెంటవెంటనే మ్యాచ్‌లు ఉండటంతో అఫ్గాన్ ఆటగాళ్లు భారత్‌తో టెస్టు కోసం సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లేదు.'
'మొదటి టెస్టు ఆడుతోన్నఅఫ్గాన్ ఆటగాళ్లకు నేను ప్రత్యేకంగా ఎలాంటి సూచనలు ఇవ్వడంలేదు. ఆడుతుంటే వారే అర్ధం చేసుకుంటారు. వారిపై నాకు ఆ నమ్మకం ఉంది. ఐపీఎల్ ఆడారు కాబట్టి భారత్ పిచ్‌లపై కొందరు ఆటగాళ్లకు అవగాహన ఉంది. దాన్ని అవకాశంగా మలచుకుంటాం. పవిత్ర రంజాన్ మాసంలో ఆడటం మా ఆటగాళ్లకేమీ కొత్త కాదు. గతంలోనూ ఆడారు' అని సైమన్స్ వివరించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications