భారత పౌరసత్వం వదులుకున్న రషీద్ ఖాన్.. ఎందుకో తెలుసా?
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన దేశం పట్ల తనకున్న అపారమైన దేశభక్తిని చాటుకున్నాడు. ఇటీవల ఆయన రాసిన 'రషీద్ ఖాన్: ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్‌డమ్' అనే పుస్తకంలో భారత్, ఆస్ట్రేలియా దేశాల నుంచి తనకు వచ్చిన పౌరసత్వ ఆఫర్ల గురించి సంచలన విషయాలను పంచుకున్నాడు. అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగోలేవని.. భారత్‌లోనే ఉండి ఇక్కడి పౌరసత్వంతో క్రికెట్ ఆడాలని భారత క్రికెట్‌కు చెందిన ఓ సీనియర్ వ్యక్తి తనను కోరినట్లు రషీద్ ఖాన్ వెల్లడించాడు.
దేశభక్తిని చాటుకున్న రషీద్ ఖాన్
రషీద్ ఖాన్ తన పుస్తకంలో 2023 ఐపీఎల్ సీజన్ నాటి ఓ సంఘటనను గుర్తు చేసుకున్నడు. "ఓ టీమ్ అధికారి నన్ను పిలిచి.. భారత్ క్రికెట్లోని ఓ ప్రముఖ వ్యక్తి నన్ను కలవాలనుకుంటున్నారని చెప్పారు. నేను ఆయన దగ్గరకు వెళ్లి పలకరించగా.. 'నీ దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్‌కు వచ్చేయ్, మేము నీకు భారత పౌరసత్వం ఇస్తాము. ఇక్కడే ఉంటూ ఇక్కడి నుండే క్రికెట్ ఆడు' అని ఆ ప్రతిపాదన చేశారు. ఆ మాటలు విని నేను ఆశ్చర్యపోయాను, ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కానీ నేను సున్నితంగా నవ్వుతూ.. 'చాలా ధన్యవాదాలు, కానీ నేను నా దేశం అఫ్గానిస్థాన్ కోసమే ఆడతానని చెప్పాను" అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.

ఆ దేశం నుంచి కూడా ఆఫర్
అయితే ఇటువంటి ఆఫర్లు కేవలం భారత్ నుంచి మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా నుంచి కూడా వచ్చాయని రషీద్ ఖాన్ స్పష్టం చేశాడు. పౌరసత్వం తీసుకుని తమ దేశాల తరఫున ఆడాలని అడిగినప్పుడు.. "నేను నా దేశం కోసం ఆడకపోతే.. ఇంకే దేశం కోసం కూడా ఆడను' అని కరాఖండిగా చెప్పినట్లు రషీద్ ఖాన్ వివరించాడు. 2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నప్పుడు కూడా రషీద్ ఖాన్‌కు భారత పౌరసత్వం ఇవ్వాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చిన సంగతి తెలిసిందే.
సంతోషకరమైన వార్తను పంచుకున్న రషీద్ ఖాన్
మరోవైపు రషీద్ ఖాన్ తన వ్యక్తిగత జీవితంలో ఓ సంతోషకరమైన వార్తను పంచుకున్నాడు. తండ్రిగా ప్రమోషన్ పొందిన రషీద్ ఖాన్ తనకు కొడుకు పుట్టినట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన కుమారుడికి 'అజ్లాన్ ఖాన్' అని పేరు పెట్టినట్లు తెలుపుతూ.. తన చిన్నారి యువరాజు ఫోటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా తోటి క్రికెటర్లు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications