న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

100 వికెట్లు: ప్రపంచ రికార్డుకి వికెట్ దూరంలో నిలిచిన రషీద్ ఖాన్

By Nageshwara Rao
Rashid Khan on verge of becoming fastest to take 100 ODI wickets

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డుకు వికెట్ దూరంలో నిలిచాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 43 వన్డేలాడిన రషీద్ ఖాన్ 99 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మరో వికెట్ గనుక తీస్తే వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.

జింబాబ్వేలోని హరారే వేదికగా జరుగుతోన్న ఐసీసీ వరల్డ్ కప్ క్వాలిఫయర్‌ టోర్నీలో భాగంగా శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 40 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. తద్వారా 99 వికెట్లతో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ను సమీపించాడు. స్టార్క్ 52 వన్డేల్లో వంద వికెట్లు తీశాడు.

దీంతో ఇప్పటివరకు వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించిన రికార్డు మిచెల్ స్టార్క్ పేరిట ఉంది. రషీద్ ఖాన్ మరో వికెట్ తీస్తే 44 వన్డేల్లోనే ఆ ఘనత సాధించిన బౌలర్‌గా మిచెల్ స్టార్క్‌ను రషీద్ ఖాన్ అధిగమిస్తాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్‌ టోర్నీలో భాగంగా వెస్టిండిస్‌తో ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది.

19 ఏళ్ల రషీద్ ఖాన్ తన తొలి 50 వికెట్లను 26 వన్డేల్లో సాధించగా.... మిగతా 49 వికెట్లను 17 మ్యాచుల్లోనే సాధించడం విశేషం. రషీద్ తీసిన మొత్తం వికెట్లలో 40 వికెట్లు జింబాబ్వేపైనే తీయడం విశేషం. గతేడాది జూన్‌లో సెయింట్ లూసియాలో విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 18 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. రషీద్ వన్డే కెరీర్‌లో ఇదే అత్యుత్తమం.

Story first published: Saturday, March 24, 2018, 17:34 [IST]
Other articles published on Mar 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X