For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్..ఎక్స్‌ట్రార్డినరీ రికార్డ్‌: ఆ ఒక్కటీ సాధిస్తే చాలు

Rashid Khan needs one wicket to join in the club of overseas players, who took 100 wickets.

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో ఈ సాయంత్రం రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ బరిలోకి దిగబోతున్నాయి. నవీముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే తలా నాలుగు మ్యాచ్‌లు ఆడేశాయి.. మూడింట్లో విజయం సాధించాయి. సంజు శాంసన్ సారథ్యంలోని పింక్ టీమ్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి వెళ్లి కూర్చుంది. హ్యాట్రిక్ విజయాల అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలైంది గుజరాత్. అయిదో స్థానంలో ఉంది.

ఈ సీజన్ రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తోంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడుతోంది. తొలి రెండు మ్యాచ్‌లల్లో భారీ విజయాలను అందుకుంది. మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ చేతిలో ఓడినా మళ్లీ పుంజుకొంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది రాజస్థాన్. మూడో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్‌పై గెలవలేకపోయింది. నాలుగో మ్యాచ్ నాటికి బౌన్స్ బ్యాక్ అయింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. నాలుగో విజయంపై కన్నేసిందీ సంజు టీమ్.

Rashid Khan needs one wicket to join in the club of overseas players, who took 100 wickets.

గుజరాత్ టైటాన్స్ తాను ఆడిన చివరి మ్యాచ్‌లో ఓడిపోయింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో దెబ్బతింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీమ్ హ్యాట్రిక్ విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. తొలి మూడు మ్యాచ్‌లల్లో ఘన విజయాలను అందుకుంది. ఆ జట్టు జైత్రయాత్రకు సన్‌రైజర్స్ బ్రేకులు వేసింది. ఈ పరాజయం నుంచి గుజరాత్ టైటాన్స్ తేరుకుని.. తన ఆటతీరును మళ్లీ గాడిన పెట్టుకుంటుందా?, టేబుల్ టాపర్‌తో ఎలా ఫైట్ చేస్తుందనేది ఇవ్వాళ తేలిపోతుంది.

గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ బ్యాక్‌బోన్‌గా ఉంటోన్నాడు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్‌పై తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ఇదే. ఈ మ్యాచ్‌లో గనక అతను మరో వికెట్ తీసుకోగలిగితే- ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంటాడు.

ఐపీఎల్‌లో వంద వికెట్లను పడగొట్టిన విదేశీ బౌలర్ల క్లబ్‌లో జాయిన్ అవుతాడీ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్. ప్రస్తుతం అతని ఖాతాలో 99 వికెట్లు ఉన్నాయి. అతని కంటే ముందు కోల్‌కత స్పిన్ బౌలర్ సునీల్ నరైన్-147, చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ డ్వేన్ బ్రావో-174, ముంబై మాజీ ప్లేయర్ లసిత్ మలింగ-170 ఉన్నారు. నిలకడగా రషీద్ ఖాన్ రాణిస్తున్నందున ఈ మ్యాచ్‌తో అతను 100 వికెట్ల విదేశీ ప్లేయర్ల ఖాతాలో చేరడం దాదాపుగా ఖాయమైనట్టే.

Story first published: Thursday, April 14, 2022, 13:54 [IST]
Other articles published on Apr 14, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+