IPL Final 2022: టీమిండియాకు ఇక అత్యుత్తమ స్పిన్నర్ అతనే అని చెప్పిన రషీద్ ఖాన్

ఐపీఎల్ 2022లో కొత్త టీం గుజరాత్ టైటాన్స్ తమ తొలి సీజన్లోనే ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నేడు రాజస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమైంది. ఎలాగైన హోం గ్రౌండ్లో గెలిచి చూపించాలనే పట్టుదలతో ఉంది. ఇకపోతే గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అత్యుత్తమ బౌలర్ అయిన రషీద్ ఖాన్.. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రాబోయే కొన్నేళ్లు టీమిండియాకు గొప్ప కంట్రిబ్యూషన్ చేయగల ప్లేయర్ల గురించి ప్రస్తావించాడు. ఇప్పటివరు 15 మ్యాచ్‌లలో రషీద్ ఖాన్ 18వికెట్లు తీశాడు. ఇక రషీద్ ఖాన్ లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను ప్రశంసించాడు. రవి బిష్ణోయ్ రాబోయే కొన్నేళ్ల పాటు టీమిండియా తరఫున గొప్ప బౌలర్ గా కొనసాగుతాడని పేర్కొన్నాడు.

లక్నో జట్టు ద్వారా ఈ బౌలర్లు
ఇక లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న రవి బిష్ణోయ్ 14 మ్యాచ్‌లలో 13వికెట్లు తీయడమే కాకుండా మంచి ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అయితే లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో బిష్ణోయ్ చెత్త ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయింది. అయినప్పటికీ లక్నో తరఫున గొప్ప ప్రతిభ కనబర్చిన మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్‌లు టీమిండియాకు తర్వాతి రోజుల్లో మంచి బౌలర్లు అయ్యే అవకాశం ఉంది.

కచ్చితంగా రవి బిష్ణోయ్ ఆ స్థాయికి చేరగలడు
రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. 'బిష్ణోయ్ యువ ప్రతిభావంతుడు. నేను అతనితో చాలా సార్లు మాట్లాడాను. రాబోయే సంవత్సరాల్లో.. అతను భారతదేశానికి పెద్ద స్టార్ అవుతాడు. అతను తన నైపుణ్యాలను విశ్వసిస్తాడు. అతన్ని నమ్మి బ్యాకప్ చేస్తూ ఉంటే తప్పకుండా అతను మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేయగలడు. అతను నా మట్టుకు మాత్రం కచ్చితంగా టీమిండియాలో అప్ కమింగ్ బౌలర్లలో గొప్ప బౌలర్ అవుతాడు.' అని క్రికెట్.కామ్ ఇంటర్వ్యూలో రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.

యుజ్వేంద్ర చాహల్‌పై ప్రశంసల జల్లు
రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. భారత లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ప్రశంసల్లో ముంచెత్తాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్సీబీ కోసం అతను ఎలా రాణించాడో, టీమిండియా కోసం ఎలాంటి ప్రదర్శన చేశాడో తెలిసిందేనని, అతను అద్భుతమైన బౌలింగ్ నైపుణ్యాలను కలిగి ఉన్నాడని పేర్కొన్నాడు. కచ్చితంగా అతను ఆర్సీబీ, టీమిండియా తరఫున ఆడిన అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు అని ప్రస్తావించాడు.

మరో వికెట్ తీస్తే ఐపీఎల్ చరిత్రలో యుజ్వేంద్ర చాహల్
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ వనిందు హసరంగా, రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్‌లు 26 వికెట్లను కలిగి పర్పుల్ క్యాప్ రేసులో నంబర 1పొజిషన్లో ఉన్నారు. ఇక పోతే నేటి ఫైనల్లో చాహల్ ఒక్క వికెట్ తీసినా పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకోవడమే కాకుండా.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్ గా నిలుస్తాడు. ఇక నేటి మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్ తరఫున రషీద్ ఖాన్, సాయికిషోర్ స్పిన్నర్లుగా బరిలోకి దిగుతుండగా.. రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగనున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications