Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. భారత దిగ్గజం రికార్డ్ బ్రేక్!

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ జట్టు ఓడిపోయినప్పటికీ.. అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 2 వికెట్లు తీయడం ద్వారా టీ20 ఆసియా కప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అంతకు ముందు ఈ రికార్డు భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ పేరిట ఉండేది.

దిగ్గజ బౌలర్ భువీ రికార్డును అధిగమించిన రషీద్ ఖాన్
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇప్పటికే అత్యధికంగా 173 వికెట్లు పడగొట్టిన రషీద్ ఖాన్.. టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో కూడా అగ్రస్థానంలోకి చేరుకున్నాడు. బౌలర్‌గా ఉన్నాడు. ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ 2 వికెట్లతో రషీద్ ఖాన్ టీ20 ఆసియా కప్‌లో తన వికెట్ల సంఖ్యను 14కి పెంచుకున్నాడు. భువనేశ్వర్ కుమార్ 6 మ్యాచుల్లో 13 వికెట్లతో ఈ రికార్డును తన పేరిట ఉంచుకోగా.. రషీద్ ఖాన్ 10 మ్యాచుల్లోనే ఈ మైలురాయిని అందుకుని భువీని అధిగమించాడు.

Rashid Khan Makes History Despite Loss Breaks Indian Legend Bhuvneshwar Kumar s Record

టీ20 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

*రషీద్ ఖాన్: 14 వికెట్లు (అఫ్గానిస్తాన్)

*భువనేశ్వర్ కుమార్: 13 వికెట్లు (భారత్)

*అమజద్ జావెద్: 12 వికెట్లు (యూఏఈ)

*వనిందు హసరంగ: 12 వికెట్లు (శ్రీలంక)

*హార్దిక్ పాండ్యా: 12 వికెట్లు (భారత్)

అఫ్గానిస్తాన్ జట్టుకు కష్టాలు
ఆసియా కప్ 2025లో అఫ్గానిస్తాన్ జట్టు తమ మొదటి మ్యాచ్‌లో హాంకాంగ్ జట్టును ఓడించి శుభారంభం చేసింది. కానీ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది. ప్రస్తుతం గ్రూప్-బీలో బంగ్లాదేశ్ మూడు మ్యాచుల్లో 4 పాయింట్లతో, శ్రీలంక రెండు మ్యాచుల్లో 4 పాయింట్లతో ముందంజలో ఉన్నాయి. ఆఫ్గానిస్తాన్ రెండు మ్యాచుల్లో 2 పాయింట్లతో ఉంది. అఫ్గానిస్తాన్ మెరుగైన నెట్ రన్‌రేట్ కలిగి ఉండటంతో తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకను ఓడిస్తే నేరుగా సూపర్-4కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ ఓడిపోతే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

Story first published: Wednesday, September 17, 2025, 9:59 [IST]
Other articles published on Sep 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+