అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చాడు. ఫిబ్రవరిలో ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)కు అందుబాటులో ఉండట్లేదని రషీద్ ఖాన్ ప్రకటించాడు. ఐర్లాండ్‌తో సిరీస్ పాటు భారత్ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభం కాకముందే పీఎస్‌ఎల్ లీగ్ ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ పనిభారం తగ్గించుకోవడం కోసం పాక్ లీగ్‌ను రషీద్ పక్కనపెట్టినట్లు సమాచారం.
మరోవైపు పీఎస్‌ఎల్‌లో స్టార్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ లేడనే వార్త పాక్ అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఎందుకంటే గత మూడు సీజన్లలో లాహోర్ క్వాలండర్స్ తరపున రషీద్ అదరగొట్టాడు. 2022, 2023 సీజన్లలో ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. కానీ 2024 సీజన్‌లో అతడు లేకపోవడం లాహోర్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బగా మారింది.

వన్డే ప్రపంచకప్ అనంతరం రషీద్ ఖాన్ క్రికెట్‌కు దూరమయ్యాడు. వెన్ను గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇటీవల టీమిండియాతో టీ20 సిరీస్‌కు అతడు ఎంపికైనప్పటికీ ఫిటెనెస్ సాధించకపోవడంతో బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పుడిప్పుడే పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తున్నాడు. ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ దృష్టిలో పెట్టుకొని పనిభారం గురించి రషీద్ జాగ్రత్త పడుతున్నాడు.
ఈ నేపథ్యంలోనే పాక్ లీగ్ కంటే ఐపీఎల్‌తోనే ఆట, అనుభవాన్ని ఎక్కువగా సంపాదించుకోవచ్చనే ఉద్దేశంతో పాకిస్థాన్‌కు రషీద్ నో చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో రషీద్ గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా, దుబాయ్ వేదికగా అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18వరకు ఈ మ్యాచ్‌లు కొనసాగనున్నాయి. టెస్టు ఆరంభానికి ఫిట్‌నెస్ సాధించకపోయినా వన్డే, టీ20లకు అందుబాటులో ఉండాలే రషీద్ శ్రమిస్తున్నాడు.