Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టేడియం అవతల పడింది..: రషీద్‌ హెలికాప్టర్ షాట్ చూశారా? (వీడియో)

Rashid Khan Does an MS Dhoni, Smashes Ball to Roof with Helicopter Shot

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌లో హెలికాప్టర్ షాట్‌కు బ్రాండ్ అంబాసిడర్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఉన్నచోటే నిలబడి.. బంతిని గాల్లోకి లేపి.. అమాంతం స్టేడియం అవతలికు పంపిస్తాడు. ధోని బ్యాట్‌ నుంచి అలాంటి కళ్లు చెదిరే షాట్లు ఎన్నోసార్లు జాలువారాయి.

ధోనీయే ఆశ్చర్యపోయేటట్టు

ధోనీయే ఆశ్చర్యపోయేటట్టు

తాజాగా ధోనీయే ఆశ్చర్యపోయేటట్టు బంతిని గాల్లో లేపి అమాంతం స్టేడియం అవతల పడేలా బాదాడు. అతడు మరెవరో కాదు ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్సర్‌ రషీద్‌ ఖాన్. అచ్చం అలాంటి షాట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు. టీ10లీగ్‌లో భాగంగా షార్జాలో జరుగుతున్న మరాఠా అరేబియన్స్‌-పక్తూన్స్ మ్యాచ్‌లో రషీద్ ఈ భారీ సిక్స్ బాదాడు.

మరాఠా అరేబియన్స్‌ జట్టు తరఫున ఆడుతోన్న రషీద్ ఖాన్

నిజానికి రషీద్‌ ఖాన్‌ అనగానే మనకు స్పిన్నరే గుర్తొస్తాడు. అతడిలో మంచి బ్యాట్స్‌మెన్‌ కూడా ఉన్నాడని ఐపీఎల్ నిరూపించింది. తాజాగా టీ10 లీగ్‌లో రషీద్‌ ఖాన్ మరాఠా అరేబియన్స్‌ జట్టు తరఫున ఈ హెలికాప్టర్ షాట్ బాదాడు. ఇందుకు సంబంధించి వీడియో క్లిప్పింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 ఇర్ఫాన్ బౌలింగ్‌లో మెరుపు సిక్స్ బాదిన రషీద్ ఖాన్

ఇర్ఫాన్ బౌలింగ్‌లో మెరుపు సిక్స్ బాదిన రషీద్ ఖాన్

ఫక్తూన్స్ బౌలర్ మహ్మద్ ఇర్ఫాన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ ఈ మెరుపు సిక్స్ కొట్టాడు. గాల్లోకి బంతి అమాంతం పైకిలేపి అలానే చూస్తుండిపోయాడు రషీద్ ఖాన్. అది నేరుగా వెళ్లి స్టేడియం పైకప్పును తాకి.. అవతల పడింది. భారీ షాట్‌ని చూసి మిగతా బ్యాట్స్‌మెన్‌తో పాటు అక్కడున్న కోచ్‌లు సైతం అవాక్కయ్యారు.

ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో రషీద్ ఖాన్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 2019 ఐపీఎల్‌లో రషీద్ బ్యాట్ నుంచి ఇలాంటి హెలికాప్టర్ షాట్లు మరిన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేయడం విశేషం.

Story first published: Friday, November 30, 2018, 13:11 [IST]
Other articles published on Nov 30, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+