For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్ అవకాశాన్ని వదులుకున్న స్టార్ స్పిన్నర్.. అసలు కారణం అదే!!

Rashid Khan declined Afghanistan team T20I captaincy
Afghanistan Captaincy కి No, నాయకుడిని కానీ,ప్లేయర్ నే - Rashid Khan || Oneindia Telugu

అబుదాబి: యువ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్.. అఫ్గానిస్థాన్‌ టీ20 జట్టుకు సారథ్యం వహించే అవకాశాన్ని వదులుకున్నాడు. కెప్టెన్సీ భారం తన ఆటపై ఏమాత్రం ప్రభావం చూపకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాడట. ఈ ఏడాది భారత గడ్డపై అక్టోబరు-నవంబరు టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. ఈ మేరకు జట్టు సన్నద్ధతలో భాగంగా కెప్టెన్సీ బాధ్యతల్ని రషీద్ ఖాన్‌కి ఇవ్వాలని అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ఆశించింది. కానీ రషీద్ మాత్రం అఫ్గానిస్థాన్ బోర్డు విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం తెలుస్తోంది.

మరోసారి అవమానాన్ని ఎదుర్కోకూడదని:

మరోసారి అవమానాన్ని ఎదుర్కోకూడదని:

అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు గత మూడేళ్లుగా తరుచుగా వివిధ ఫార్మాట్లలో సారథుల్ని మారుస్తూ వస్తోంది. అస్గర్ అఫ్గాన్, మహ్మద్ షెహజాద్, నజ్ముల్లా జర్దాన్, గుల్బుద్దీన్ నబీలు సారథులుగా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో గతంలో అన్ని ఫార్మాట్లలో అఫ్గాన్ జట్టుకు నాయకత్వం వహించిన రషీద్‌ ఖాన్.. ఇప్పుడు కెప్టెన్సీ తీసుకునేందుకు సిద్ధంగా లేడు. మరోసారి అవమానాన్ని ఎదుర్కోకూడదని రషీద్‌ భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ జట్టుకు టెస్టు, వన్డేలకు హస్మతుల్లా షాహిది కెప్టెన్‌గా ఉన్నాడు. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌ కోసం అఫ్గాన్ బోర్డు అన్వేషిస్తోంది.

వైస్ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా:

వైస్ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా:

'నేను కెప్టెన్‌గా కంటే ఆటగాడిగా ఉత్తమ ప్రదర్శన చేయగలనని గట్టిగా నమ్ముతున్నా. నా ఆటను ఇంకా మెరుగు పర్చుకోవాలని ఆశిస్తున్నా. ప్రస్తుతానికి వైస్ కెప్టెన్సీని ఆస్వాదిస్తున్నా. కెప్టెన్‌కి అవసరమైనప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు నేను ఎప్పుడూ సిద్దమే. కెప్టెన్సీకి మాత్రం ఇప్పుడు దూరంగా ఉండాలనుకుంటున్నా. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తోంది. ఈ పరిస్థితుల్లో సారథ్యం శక్తికి మించిన భారమే. ఆటగాడిగానే నేను సంతోషంగా ఉంటా. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, సెలెక్టర్లు ఎవరికి టీ20 పగ్గాలు ఇచ్చినా.. నేను మద్దతిస్తా' అని రషీద్‌ ఖాన్ తెలిపాడు. రషీద్‌ అఫ్గాన్ తరఫున 5 టెస్టులు, 74 వన్డేలు, 51 టీ20లు ఆడాడు.

ఒక టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు:

ఒక టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు:

22 ఏళ్ల రషీద్‌ ఖాన్ ఇప్పటికే పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు. ఇటీవలే ప్రస్తుత తరంలో ఎవరికీ సాధ్యంకాని ఓ అరుదైన ఘనతను అతడు సొంతం చేసుకున్నాడు. 21వ శతాబ్దంలో ఒకే టెస్ట్‌లో అత్యధిక ఓవర్లు వేసిన బౌలర్‌గా రషీద్‌ ఖాన్‌ రికార్డు నెలకొల్పాడు. గత మార్చిలో జింబాబ్వేతో జరిగిన టెస్ట్‌లో రషీద్‌ 99.2 ఓవర్లు వేసి చరిత్ర సృష్టించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసి 4 వికెట్లు తీసిన రషీద్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు బౌలింగ్‌ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. 2002లో కేప్‌టౌన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా స్పిన్‌ మాంత్రికుడు షేన్‌ వార్న్‌ 98 ఓవర్లు వేశాడు. ఆ రికార్డును రషీద్‌ బ్రేక్‌ చేశాడు. అయితే ఒక టెస్టులో అత్యధిక ఓవర్లు వేసిన ఘనత మాత్రం శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ పేరిట ఉంది. 1998లో ఓవల్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో మురళీధరన్‌ 113.5 ఓవర్లు బౌల్‌ చేశాడు.

Story first published: Saturday, June 5, 2021, 13:00 [IST]
Other articles published on Jun 5, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+