Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్‌తో చారిత్రాత్మక టెస్టు ముందు అఫ్ఘన్.. తొలి విజయం

Rashid Khan Creates World Record as Afghanistan Beat Bangladesh by 46 Runs

హైదరాబాద్: భారత్‌తో చారిత్రాత్మక టెస్టుకు ముందు సన్నాహకంగా బంగ్లాదేశ్‌తో నిర్వహిస్తున్న టి20 సిరీస్‌లో అఫ్గానిస్తాన్‌ జట్టు సత్తా చాటింది. ఆదివారం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్థాన్‌ 45 పరుగులతో గెలుపొందింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రషీద్‌ ఖాన్‌ (3/13), నబీ (2/21) స్పిన్‌తో చెలరేగడంతో తొలి టి20 మ్యాచ్‌లో విజయం అఫ్ఘన్ వశమైంది.

తొలుత ఆఫ్ఘానిస్థాన్‌ 20 ఓవర్లలో 167/8 స్కోరు చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ షహజాద్‌ (40), సమీవుల్లా షేన్వారి (36), ఉస్మాన్‌ ఘని (26) రాణించారు. బంగ్లా బౌలర్లలో మహ్మదుల్లా, అబుల్‌ హసన్‌ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్యఛేదనలో ఆఫ్ఘాన్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ 19 ఓవర్లలో 122 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (30) జట్టులో టాప్‌స్కోరర్‌. ఆఫ్ఘాన్‌ స్టార్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ 13 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన చూపించిన రషీద్ ఖాన్‌కే 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ మంగళవారం ఇక్కడే జరుగనుంది. అఫ్గానిస్తాన్‌ జట్టును ప్రోత్సహించడంలో భాగంగా భారత్‌లో వేదికలను ఆ జట్టు హోం గ్రౌండ్‌లుగా వినియోగించుకునేందుకు బీసీసీఐ ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అఫ్ఘన్‌కు ఈ అవకాశం వచ్చింది.

బంగ్లాదేశ్ తరపున ఆడిన మహమ్మదుల్లా, షకీబ్ అల్ హసన్ చక్కటి ప్రదర్శన చేశారు. ఇద్దరూ చెరో వికెట్లు సాధించారు. ఓవర్‌కు 8 పరుగులు చేయాల్సిన సమయంలో మొత్తానికి బంగ్లాదేశ్ తడబాటుకు గురైంది. ఈ క్రమంలో బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్భాల్ గోల్డెన్ డక్ అవడంతో జట్టు కోలుకోలేకపోయింది.

Story first published: Monday, June 4, 2018, 9:09 [IST]
Other articles published on Jun 4, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+