Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Asia Cup 2022 : అంతర్జాతీయ టీ20ల్లో మరో కీలక మైలురాయి అందుకున్న రషీద్ ఖాన్

Rashid Khan Became the Second Most Highest Wicket Taker In T20Is

ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. 23 ఏళ్ల రషీద్ ఖాన్.. టీ20 ఫార్మాట్లో ఇప్పటివరకు 115వికెట్లు పడగొట్టాడు. ఐకానిక్ షార్జా క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రషీద్ ఖాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న షకీబ్ అల్ హసన్ సారథ్యంలోని బంగ్లా జట్టు 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 127పరుగులకే పరిమితమైంది. రషీద్ ఖాన్ తన స్పెల్‌లో 4ఓవర్లలో 22పరుగులిచ్చి 3వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు.

ఇకపోతే తాజా మైలురాయి ద్వారా టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ (114వికెట్ల)ను రషీద్ ఖాన్‌ను అధిగమించాడు. ఇకపోతే ఈ విషయంలో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్‌లో ప్రమాదకరమైన ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్‌ను వర్‌ప్లేలో షకీబ్ ఔట్ చేయడంతో అతని వికెట్ల సంఖ్యను 122కి చేరుకున్నాడు. ఇక 2015లో తన టీ20ల్లో అరంగేట్రం చేసిన రషీద్.. సూపర్ స్టార్‌ ప్లేయర్‌గా కొనసాగుతున్నాడు. కేవలం 53 టీ20ల్లోనే 100 టీ20 వికెట్లు తీసి అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కూడా రషీద్ ఖాన్ ప్రస్తుతం కొనసాగుతున్నాడు. అతను మొత్తం 472 వికెట్లు తీశాడు. అన్ని రకాల టీ20ల్లో 604వికెట్లతో డ్వేన్ బ్రావో అగ్రస్థానంలో ఉన్నాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) - 99 మ్యాచ్‌ల్లో 121 వికెట్లు
రషీద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్) - 68 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు
టిమ్ సౌతీ (న్యూజిలాండ్) - 95 మ్యాచ్‌లలో 114 వికెట్లు
లసిత్ మలింగ (శ్రీలంక) - 84 మ్యాచ్‌ల్లో 107 వికెట్లు
ఇష్ సోధి (న్యూజిలాండ్) - 76 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు

Story first published: Wednesday, August 31, 2022, 8:21 [IST]
Other articles published on Aug 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+