For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఫ్ఘ‌నిస్తాన్ మేజిక్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్‌కు కీల‌క బాధ్య‌త‌లు

Rashid Khan Appointed Afghanistan Captain In All Formats || Oneindia Telugu
Rashid Khan, Asghar Afghan Appointed as Captain, Vice Captain of Afghanistan Cricket Team

కాబూల్‌: ఆఫ్ఘ‌నిస్తాన్ మేజిక్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కింది. ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు బాధ్య‌త‌ల‌ను ఆయ‌న భుజ‌స్కందాల మీద మోపింది ఆ దేశం. ఆఫ్ఘ‌నిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ప‌గ్గాల‌ను ర‌షీద్ ఖాన్ చేతిలో పెట్టింది. ఆయ‌న‌ను కేప్టెన్‌గా నియ‌మించింది. మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ అస్ఘ‌ర్ ఆఫ్ఘ‌న్‌ను వైఎస్ కేప్టెన్‌గా నియ‌మించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆదేశాల‌ను జారీ చేసింది. ర‌షీద్ ఖాన్ వ‌ల్లే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో జ‌ట్టుకు గుర్తింపు ల‌భించింద‌ని ఈ ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. వ‌న్డే, టెస్ట్, టీ20 ఫార్మ‌ట్ల‌కు ర‌షీద్ ఖానే కేప్టెన్‌గా ఉంటారు. ఈ ఏడాది ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు రెండు ద్వైపాక్షిక సిరీస్‌ల‌ను ఆడ‌బోతోంది.

వచ్చే సెప్టెంబ‌ర్‌లో ఆ జ‌ట్టు బంగ్లాదేశ్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌బోతోంది. బంగ్లాదేశ్ టీమ్‌తో ఒక టెస్ట్ మ్యాచ్‌ను ఆడుతుంది. అనంత‌రం బంగ్లాదేశ్‌, జింబాబ్వేల‌తో ముక్కోణ‌పు వ‌న్డే మ్యాచ్‌ల‌ను ఆడుతుంది. ఈ ముక్కోణ‌పు సిరీస్ ముగిసిన కొద్దిరోజుల‌కే వెస్టిండీస్ జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తుంది. వెస్టిండీస్‌-ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ న‌వంబ‌ర్ 5 నుంచి డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ప‌ర్య‌ట‌నలో వెస్టిండీస్ జ‌ట్టు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను సొంత‌గ‌డ్డ‌పై ఢీ కొడుతుంది. ఈ సంద‌ర్భంగా మూడు టీ20, మూడు వ‌న్డే, ఒక టెస్ట్ మ్యాచ్‌లను నిర్వ‌హిస్తారు.

Story first published: Friday, July 12, 2019, 19:57 [IST]
Other articles published on Jul 12, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+