2036 Olympics: 650 ఎకరాలు.. ఒలింపిక్స్ కోసం రేప్ కేసు దోషికి చెందిన భూమి
2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు భారత్ సన్నాహాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ ప్రపంచ క్రీడా పండగ నిర్వహణ కోసం స్థలాన్ని వెతుకుతోంది కేంద్ర క్రీడా శాఖ. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం దగ్గర్లోని సర్దార్ పటేల్ స్పోర్ట్స్ ఎన్‌క్లేవ్, ఒలింపిక్ విలేజ్‌తో పాటు ఇతర క్రీడా మైదానాల సౌకర్యాల కోసం భూమిని సేకరించేందుకు ప్రణాళికలను రచిస్తోంది.
రేప్ కేసులో దోషిగా తేలిన బాబా ఆశ్రమం..
ఇందుకోసం ఇప్పటికే రేప్ కేసులో దోషిగా తేలిన ఆశారాం బాపు ఆశ్రమానికి చెందిన భూమిని తీసుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో పాటే భారతీయ సేవాసమాజం, సదాశివ ప్రజ్ఞామండల్ అనే మరో రెండు ఆశ్రమాల స్థలాలను కూడా పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను తెలియజేస్తూ జాతీయ మీడియా సంస్థలు.. కథనాలు ప్రచురించాయి. ఒకవేళ అనుకున్నట్టే ఈ ఆశ్రమాల స్థలాలను.. ఒలింపిక్స్ క్రీడల కోసం కేటాయిస్తే.. సదరు ఆశ్రమాలను మరోచోటికి తరలించాల్సి ఉంటుంది.

మొత్తంగా ఎన్ని ఎకరాలు అంటే
అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ.. మాస్టర్ ప్లాన్ తో ఈ స్థలాలని సేకరించి ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించనుంది. అహ్మదాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (AUDA) సాయంతో ఓ అంతర్జాతీయ కన్సల్టెంట్.. ఈ ఒలింపిక్ క్రీడల ఏర్పాట్లకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయనుంది. ఈ మాస్టర్ ప్లాన్ లో స్టేడియం దగ్గర్లోని శివనగర్, వంజారావాస్ ప్రాంతంలోని నివాస ప్రాంతాలను కూడా ఈ క్రీడల కోసం స్థలాన్నిసేకరించనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా దాదాపు 650 ఎకరాల భూమిని సేకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications