For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మీరు మాకు గర్వకారణం... ఇప్పుడు మా వంతు: కపిల్ బర్త్‌డే సందర్భంగా రణవీర్

 Ranveer Singh wishes legend Kapil Dev a happy birthday: You made us proud. Now it’s our turn

హైదరాబాద్: కపిల్ దేవ్ భారత దేశానికి తొలి వన్డే వరల్డ్‌కప్‌ను అందించిన కెప్టెన్. కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా జట్టును ముందుండి నడిపించి ఎన్నో అపూర్వ విజయాలను అందించాడు. ఇంగ్లాండ్ వేదికగా 1983 వన్డే వరల్డ్‌కప్‌లో భయంకర వెస్టిండిస్ జట్టుని ఓడించి టీమిండియాను జగజ్జేతగా నిలిపాడు.

అలాంటి కపిల్ దేవ్ సోమవారం తన 61వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచ క్రికెట్‌లో కపిల్ దేవ్ సాధించిన అనేక రికార్డులను అభిమానులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అందులో ఒకటి కపిల్‌ దేవ్ ఆడిన ఆఖరి 184 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారి కూడా రనౌట్ కాలేదు. అంతేకాదు టెస్టుల్లో 5 వేల పరుగులకు పైగా చేసి 400 వికెట్లు మైలురాయిని అందుకున్న ఏకైక ఆటగాడు కపిల్‌దేవే. 1983 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై కపిల్‌ దేవ్ 138 బంతుల్లో 175 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో తొమ్మిదో వికెట్‌కు సయ్యద్‌ కిర్మాణి (24*)తో కలిసి అతడు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ ఇన్నింగ్సే టీమిండియాను 1983 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేర్చింది. ఆ తర్వాత ఫైనల్లో ఏం జరిగిందో మనందరికీ తెలిసిందే. కపిల్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 సినిమాని రూపొందిస్తోన్నారు.

ఈ సినిమాని హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో క‌పిల్ దేవ్ పాత్ర‌ని బాలీవుడ్ నటుడు ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నారు. దీపిక పదుకొణె ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా నటిస్తుంది. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు.

2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. అయితే ఈ రోజు క‌పిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా రణవీర్ సింగ్ తన ఇనిస్టాలో సినిమాకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అవి అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి.

Story first published: Monday, January 6, 2020, 17:06 [IST]
Other articles published on Jan 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+