'83' ఈ నెంబర్‌కి ఎంతో ప్రత్యేకత: కపిల్ డెవిల్స్‌పై సినిమా
హైదరాబాద్: 1983, జూన్ 25.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. ఆరోజు కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు తొలిసారిగా వరల్డ్ కప్ సాధించిన క్షణం. ప్రతి క్రికెట్ అభిమాని మరువలేని క్షణం అది. అంతేకాదు భారత్‌లో క్రికెట్ అంతగా పాపులర్ కావడానికి కారణమైంది.
భారత్‌కు తొలి వరల్డ్ కప్ అందించిన కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు '83' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్రను బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ పోషిస్తున్నాడు.

ముంబైలో టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం
ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం ముంబైలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 1983 ప్రపంచకప్ జట్టు సభ్యులు కపిల్‌దేవ్, మొహిందర్ అమర్ నాథ్, శ్రీకాంత్, వెంగ్‌సర్కార్, సందీప్ పాటిల్, మదన్‌లాల్, యశ్‌పాల్ శర్మ, రోజర్ బిన్నీ, బల్విందర్ సంధూ, కీర్తి ఆజాద్, సునీల్ వాల్సన్ పాల్గొన్నారు.

కపిల్ పాత్రలో రణ్‌వీర్ సింగ్
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కపిల్ పాత్రలో రణ్‌వీర్ నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పాత్రకు అతడే సరైనవాడని తెలిపారు. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తాను 1983 వరల్డ్‌కప్ టీవీలో చూశాను. అప్పటి విజయం భారత క్రికెట్లో ఇంతటి మార్పును తెస్తుందని ఊహించలేదన్నారు. గొప్ప ఆటగాడి జీవిత చరిత్రను తెరకెక్కించడం ఆనందంగా ఉందని కబీర్ ఖాన్ పేర్కొన్నారు.

వెతికిపట్టుకోవడం అంత సులువుకాదు
కపిల్ దేవ్ మాట్లాడుతూ 1983 జట్టు సభ్యులకు సరిగ్గా సరిపోయే నటులను ఇండియాలో వెతికిపట్టుకోవడం అంత సులువుకాదని కపిల్ అభిప్రాయపడ్డాడు. ఇక, కపిల్ పాత్రను పోషించాలని అడిగినప్పుడు తానెంతో ఉత్కంఠకు గురయ్యానని రణ్‌వీర్ సింగ్ వెల్లడించాడు. తాను ఆ రోల్ చేయగలనా అని కూడా ప్రశ్నించుకున్నానని తెలిపాడు.

వివియన్ రిచర్డ్స్‌ను అవుట్ చేశామిలా
మాజీ పేసర్ మదన్‌లాల్ అప్పటి మ్యాచ్‌లో జరిగిన విషయాన్ని పంచుకున్నాడు. '184 పరుగుల విజయలక్ష్యంతో విండిస్ బ్యాటింగ్ చేస్తోంది. నేను వేసిన ఓవర్‌లో విండీస్ గ్రేట్ బ్యాట్స్‌మన్ వివియన్ రిచర్డ్స్ ఏకంగా 3 బౌండరీలు బాదాడు. దీంతో తర్వాతి ఓవర్ వేసే సమయంలో కపిల్ నన్ను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా కోరాడు. కానీ నేను అందుకు అంగీకరించలేదు. రిచర్డ్స్‌ను నేను అవుట్ చేస్తాను అని చెప్పి బంతి తీసుకున్నాను. అలాగే అతన్ని ఔట్ చేశాను. అప్పట్లో కపిల్ ఆత్మవిశ్వాసంతో ఉన్న ప్రతి క్రికెటర్‌కు అవకాశం ఇచ్చేందుకు వెనుకాడలేదు' అని మదన్‌లాల్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.

రియల్ లొకేషన్లలోనే షూటింగ్
ఇదిలా ఉంటే అప్పటి ప్రపంచ కప్‌లో పాల్గొన్న క్రికెటర్ల ఫొటోలతో కూడిన బ్యాట్లు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సీసీఎల్ లీగ్ ఫౌండర్ విష్ణువర్ధన్ ఇందూరి విబ్రీ మీడియా పతాకంపై ఫాంటూమ్ ఫిల్మ్స్‌తో కలిసి రూపొందిస్తున్న ‘83' వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళుతుంది. అయితే రియల్ లొకేషన్లలోనే ఈ సినిమాని షూట్ చేయనుండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications