
స్థిరంగా అశ్విన్ ర్యాంకు
తాజాగా యాషెస్ సిరీస్‌లో రెండు టెస్టు మ్యాచ్‌లు ముగిసినప్పటికీ అశ్విన్ స్థానానికి ఢోకా లేకుండా పోయింది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో 883 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే 360 పాయింట్లతో ఆల్‌రౌండర్ విభాగంలోనూ రెండో స్థానంలో స్థిరంగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతానికైతే అశ్విన్ ర్యాంకులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.
మరో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 346 పాయింట్లతో అశ్విన్ తర్వాతి స్థానంలో మూడో ర్యాంకులో ఉన్నాడు. ఆల్‌రౌండర్ విభాగంలో మొదటి ర్యాంకులో వెస్టిండీస్ ఆల్‌రౌండ్ జేసన్ హోల్డర్ 383 పాయింట్లతో ఉన్నాడు.
యాషెస్ సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైనప్పటికీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ స్థానానికి ఇబ్బంది లేకుండా పోయింది. బౌలింగ్ విభాగంలో 904 పాయింట్లతో కమిన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్ మినహా మరో భారత బౌలర్ టాప్ ప్లేసులో స్థానం దక్కించుకోలేకపోయాడు.
|
నంబర్ 1 ర్యాంకు నుంచి రూట్ ఔట్
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా కాలంగా నంబర్ 1 ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ ఆ స్థానం నుంచి రెండో ర్యాంకుకు పడిపోయాడు. నంబర్ వన్ ర్యాంకును ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబూషేన్ కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో నిలకడగా రాణిస్తుండడం లబూషెన్కు కలిసొచ్చింది.
లబూషేన్ ఖాతాలో 912 పాయింట్లు ఉండగా.. రూట్ ఖాతాలో 897 పాయింట్లే ఉన్నాయి. ఇక 884 పాయింట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ సీవ్ స్మిత్ మూడో ర్యాంకులో ఉన్నాడు. ఇక టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ 797 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఏడో ర్యాంకుకు పడిపోయాడు. కోహ్లీ ఖాతాలో 756 పాయింట్లు ఉన్నాయి.
|
టాప్ ప్లేసులో బాబర్
ఇక టీ20 ర్యాంకుల బ్యాటింగ్ విషయానికొస్తే పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 805 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. మరో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 798 పాయింట్లతో మూడో ర్యాంకులో ఉన్నాడు. టాప్ 10లో టీమిండియా నుంచి రాహుల్ మాత్రమే చోటు సంపాదించుకున్నాడు. 729 పాయింట్లతో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు.