For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రీజు వదిలిపోను.. పఠాన్‌, రహానే మధ్య వాగ్వాదం (వీడియో)!!

Ranji Trophy: Yusuf Pathan refuses to walk back after incorrect decision, Ajinkya Rahane gets involved

ముంబై: క్రికెట్‌లో అంపైరింగ్‌ ప్రమాణాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. ఫీల్డ్ అంపైర్ల తప్పుడు నిర్ణయాలతో ఆటగాళ్లు బలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే రంజీ ట్రోఫీలో చోటుచేసుకుంది. అంపైర్‌ తప్పుడు నిర్ణయం కారణంగా టీమిండియా క్రికెటర్లు యూసుఫ్‌ పఠాన్‌, అజింక్య రహానేల మధ్య మాటల వాగ్వాదం జరిగింది. విషయంలోకి వెళితే.

డిఫెన్స్‌ ఆడబోతే:

డిఫెన్స్‌ ఆడబోతే:

రంజీ ట్రోఫీలో భాగంగా గురువారం ముంబై, బరోడా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ముంబై నిర్దేశించిన 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా.. 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో దీపక్‌ హుడాతో కలిసి యూసుఫ్‌ పఠాన్‌ బరోడా ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. 48 ఓవర్‌లో ముంబై స్పిన్నర్‌ శశాంక్‌ వేసిన బంతిని పఠాన్‌ డిఫెన్స్‌ ఆడాడు. అయితే బంతి బౌన్స్‌ తీసుకొని పఠాన్‌ ఛాతికి తగిలి గాల్లోకి లేచింది.

పఠాన్‌, రహానే మధ్య వాగ్వాదం:

పఠాన్‌, రహానే మధ్య వాగ్వాదం:

గాల్లోకి లేచిన బంతిని షార్ట్‌ లెగ్‌ వద్ద ఉన్న ఫీల్డర్‌ జై బిస్టా అందుకోవడంతో ముంబై జట్టు అప్పీల్‌ చేసింది. అయితే కాసేపు సంకోచించిన అంపైర్‌ ఔటివ్వడంతో ఆశ్యర్యపోయిన పఠాన్‌.. క్రీజు వీడకుండా అక్కడే ఉన్నాడు. అంపైర్ల వైపు అసంతృప్తితో చూస్తూ అలానే ఉండిపోయాడు. ఇక ఇద్దరు అంపైర్లు ఒకరికొకరు దగ్గరకు రాగా.. ముంబై కెప్టెన్‌ రహానే బ్యాట్స్‌మన్‌ పఠాన్‌ దగ్గరికి వచ్చి ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

రహానే పక్కకు పోవడంతో:

వాగ్వాదం జరుగుతున్న సమయంలో ముంబై కీపర్‌ రహానేను పక్కకు తీసుకెళ్లడంతో.. చేసేదేమిలేక పఠాన్‌ క్రీజు వదిలి వెళ్లాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో బరోడా 309 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. లక్ష్య ఛేదనలో బరోడా 224 పరుగులకే ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లోనే ముంబై ఆటగాడు పృథ్వీ షా డబుల్‌ సెంచరీ చేసాడు.

Story first published: Friday, December 13, 2019, 10:48 [IST]
Other articles published on Dec 13, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+