న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంత దారుణమా!: బ్యాట్స్‌మన్ కుప్పకూలినా పట్టించుకోని ప్లేయర్స్ (వీడియో)

Ranji Trophy: Vidarbha Batsman, Hit By Bouncer, Lies In Pain As Delhi Players Walk Past Him

హైదరాబాద్: జెంటిల్‌మెన్‌ గేమ్‌గా పేర్కొనే క్రికెట్‌ మరీ ఇంత స్వార్థపూరితంగా ఆడతారని ఎవ్వరూ ఊహించరు. ఒక పక్క బ్యాట్స్‌మన్ వేలికి దెబ్బ తగిలి విలవిల్లాడుతుంటే ఫీల్డర్లు అస్సలు పట్టించుకోలేదు. వాళ్లతో పాటుగా అంపైర్ సైతం చూడనైనా లేదు.

ఫైనల్లో ఓడిపోతున్నామని ఈర్ష్యతోనో ఏమో ఢిల్లీ జట్టు నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ బౌలర్‌ సంధించిన ఓ బౌన్సర్‌కి విదర్భ బ్యాట్స్‌మన్‌ గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో మైదానంలోనే కుప్పకూలాడు. గాయంతో విలవిలలాడాడు.

Sportsmanship ?! 🤔

A post shared by mahi7781 🔵 (@bleed.dhonism) on

ప్రత్యర్థి ఆటగాళ్లు ఎవరూ తమకు పట్టనట్లు ప్రవర్తించారు. బ్యాట్స్‌మన్‌ ఓ వైపు నొప్పితో బాధపడుతుంటే.. అతని పక్కనుంచే నడుచుకుంటూ వెళ్లిపోయారు. ఓవర్‌ ముగియడంతో ఫీల్డింగ్‌ పొజిషన్లు మారే హడావుడిలో మునిగిపోయారు. మరో ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ మాత్రం వైద్య సిబ్బంది మైదానంలోకి రావాల్సిందిగా సైగలు చేశాడు. అయితే మైదానంలో ఉన్న అంపైర్లు కూడా ఆ బ్యాట్స్‌మన్‌కి ఎలాంటి సహాయం అందించకపోవడం గమనార్హం.

రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌ చేరడమే కాకుండా.. టైటిల్‌ కైవసం చేసుకొని రికార్డు సృష్టించింది విదర్భ జట్టు. ఏడుసార్లు ఛాంపియన్‌ అయిన దిల్లీని ఫైనల్‌లో ఆ జట్టు మట్టికరిపించింది.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారాయి. ఢిల్లీ జట్టు ప్రవర్తనపై క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. వారిలో క్రీడాస్ఫూర్తి లోపించిందని కామెంట్లతో విమర్శిస్తున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 3, 2018, 13:40 [IST]
Other articles published on Jan 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X