టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీకి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అన్న సంగతి తెలిసిందే. వీరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లు కూడా ఉన్నారు. ముఖ్యంగా టీమిండియా మహిళా జట్టు విషయనికొస్తే.. శ్రేయాంకా పాటిల్.. విరాట్ కు వీరాభిమాని. తాజాగా ఆమె మరోసారి కోహ్లీ విషయంలో సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది. తన గురించి వైరల్ అయిన ఓ పోస్ట్ విషయంలో క్రికెట్ అభిమానులకు సెటైరికల్ గా సమాధానం చెబుతూనే, ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.
కోహ్లీ.. ప్రస్తుతం దిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా రంజీ మ్యాచ్ ఆడుతోన్న సంగతి తెలిసిందే. రైల్వేస్ జట్టుతో జరిగే మ్యాచ్ లో అతడు బరిలోకి దిగాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విరాట్ రంజీ మ్యాచ్ బరిలోకి దిగడంతో వేలాది మంది అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. దీంతో అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం విరాట్ నామస్మరణతో మోత మోగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట్లో ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి.

ఈ క్రమంలోనే టీమిండియా మహిళా క్రికెటర్ శ్రేయాంకా పాటిల్ కూడా అరుణ్ జెట్లీ స్టేడియానికి వచ్చినట్లు ఓ పోస్ట్ వైరల్ అయింది. అందులో ఆమె స్టాండ్స్ లో కూర్చొని ఉన్నట్లు కనిపించింది. అయితే ఈ పోస్ట్ శ్రేయాంక్ పాటిల్ దృష్టికి వచ్చింది. దీంతో ఆమె ఈ పోస్ట్ పై కోహ్లీ ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా స్పందించింది.
"నా ఫ్యామిలీ ఒకరు దీనిని పంపించి, నేను అబద్ధం చెబుతున్నానని అనుకున్నారు. అవును ఇది నిజమే, నేను కింగ్ మ్యాచ్ చూసేందుకు దిల్లీలోనే ఉన్నాను. నా మనసుతో చూస్తున్నాను. కానీ వాస్తవానికి నేను నా ఫేవరెట్ స్టేడియంలో (చిన్నస్వామి మైదానం) మ్యాచ్ చూస్తున్నాను." అని పేర్కొంది.
ప్రస్తుతం శ్రేయాంకా పాటిల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో కర్ణాటక - హరియాణా మధ్య జరుగుతోన్న ఓపెనింగ్ డే మ్యాచ్ కోసం అక్కడికి వెళ్లింది. కానీ ఈ విషయం తెలీక, కొంతమంది ఆమె అరుణ్ జెట్లీ స్టేడియంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. అందుకే దీనిపై శ్రేయాంక పాటిల్ స్పందించింది.
అర్సీబీ క్వీన్ గా
కోహ్లీ, శ్రేయాంక్ పాటిల్.. ఇద్దరూ లీగ్ క్రికెట్ లో ఆర్సీబీ జట్టు తరఫునే ఆడుతున్నారు. డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‌లో శ్రేయాంక.. సంచలన ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో అందరూ ఆమెను 'ఆర్సీబీ క్వీన్'గా అభివర్ణించారు. పైగా ఈ కర్ణాటక ప్లేయర్ విరాట్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ కూడా. అప్పట్లో బెంగళూరు జట్టుకు కోహ్లీ సారథిగా ఉన్న సమయంలో అతడిని కలిసింది. ఆ తర్వాత క్రికెట్‌పై ఇష్టం పెంచుకుని, స్టార్ ప్లేయర్‌గా ఎదిగింది.
Someone in the family sent this and thought I was lying to them 🤪 I agree, in spirit I was in Delhi to watch The King but actually, I was watching at my favourite stadium! #Chinnaswamy https://t.co/qw3PghOs5D
— Shreyanka Patil (@shreyanka_patil) January 30, 2025