ద్రావిడ్ ప్రియ శిష్యుడిలా, పుజారా తమ్ముడిలా యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్.. 53బంతుల పాటు సింగిల్ కూడా తీయలే
రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో యశస్వి జైశ్వాల్ ఛటేశ్వర్ పుజారాకు తమ్ముడిలా, రాహుల్ ద్రావిడ్ ప్రియ శిష్యుడిలా, మార్నస్ లబుషేన్ దోస్తులా బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో అత్యంత ఢిఫెన్స్ బ్యాటింగ్ చేశాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 53బంతులు ఎదుర్కొనే దాకా ఒక్క పరుగు కూడా చేయలేదు. 54బంతికి ఫోర్ కొట్టి తన తొలి పరుగులు నమోదు చేశాడు. ఐపీఎల్లో మనం చూసిన జైశ్వాల్ మంచి హిట్టర్ అని తెలుసు. కానీ అతను టెస్ట్‌లో ఇంత ఓపికగా ఆడగలడా అని అతని ఫాలోవర్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక ముంబై సెమీస్లో ఉత్తరప్రదేశ్ మీద గెలిచేలా కన్పిస్తుంది.
212 పరుగులు భారీ ఆధిక్యం సాధించిన ముంబై
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హార్దిక్ థామోర్ (115 పరుగులు) సెంచరీతో చెలరేగడంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో రెండో రోజు ముంబై.. ఉత్తర ప్రదేశ్ మీద భారీ స్కోరు చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 393పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఉత్తరప్రదేశ్ ఆట ముగిసే సమయానికి 2వికెట్ల నష్టానికి 25పరుగులు మాత్రమే చేసింది. ఇక మూడో రోజు బ్యాటింగ్‌కు దిగిన ఉత్తరప్రదేశ్ కేవలం 180పరుగులకే ఆలౌటైంది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్ పండే, మోహిత్ అవస్తీ, తనుష్ కొటియన్ తలా 3వికెట్లు తీసి ఉత్తరప్రదేశ్ పతనాన్ని శాసించారు. 212పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ముంబై.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగి తన ఆధిక్యాన్ని పెంచుకుని విజయానికి బాటలు వేసుకుంటుంది.
ఓ పక్క పృథ్వీ షా బాదుతుంటే జైశ్వాల్ మాత్రం..
ఓపెనర్ పృథ్వీ షా (64పరుగులు 71బంతుల్లో 12ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడుతూ స్కోరుబోర్డు పరుగులెత్తించాడు. ఇక మరో ఎండ్‌లో ఉన్న ఓపెనర్ యశస్వి జైశ్వాల్ అయితే టెస్ట్ అంటే ఏంటో రుచి చూపించేలా పూర్తి ఢిపెన్స్ ఆడాడు. 52బంతులు ఎదుర్కొనేంత వరకు అతను ఒక్క పరుగు కూడా చేయలేదు. మొండిగా క్రీజులో నిలబడ్డాడు. 66పరుగులకు షా ఔటవ్వడంతో ఓపెనింగ్ భాగస్వామ్యం ముగిసింది. ఈ 66పరుగుల్లో 64పరుగులు షావి కాగా 2పరుగులు ఎక్స్ ట్రాలు.
54వ బంతికి ఫోర్
ఇక జైశ్వాల్ తాను ఎదుర్కొన్న 54వ బంతికి ఫోర్ కొట్టి పరుగుల ఖాతా తెరిచాడు. ఇక తర్వాత కుదురుగా పరుగులు చేస్తూ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక యశస్వి జైశ్వాల్ (35పరుగులు 114బంతుల్లో 5ఫోర్లు, 1సిక్సర్), అర్మన్ జాఫర్ (32పరుగులు 67బంతుల్లో 5ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తున్నాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇరువురు కలిసి 67పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తద్వారా ముంబై స్కోరు 1వికెట్ కోల్పోయి 133కు చేరుకుంది. 346 పరుగుల ఆధిక్యం సాధించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో జైశ్వాల్ (100) సెంచరీతో ఆకట్టుకున్నాడు.
స్కోరు సమ్మరీ
ముంబై తొలి ఇన్నింగ్స్ - 393, ( ముంబై : హార్దిక్ థామోర్ 115పరుగులు, యశస్వి జైశ్వాల్ 100పరుగులు), (యూపీ: కరన్ శర్మ 4వికెట్లు, సౌరబ్ కుమార్ 3వికెట్లు)
ఉత్తరప్రదేశ్ తొలి ఇన్నింగ్స్ - 180 (యూపీ: మాధవ్ కౌశిక్ 38పరుగులు, శివమ్ మావి 48పరుగులు), (ముంబై: తుషార్ దేశ్ పండే - 3వికెట్లు, మోహిత్ అవస్థీ - 3, తనుష్ కోటియన్ - 3)
ముంబై రెండో ఇన్నింగ్స్ - 133/1 (42ఓవర్లు) (ముంబై : జైశ్వాల్ 35, అర్మన్ జాఫర్ 32), (యూపీ: సౌరభ్ కుమార్ 1వికెట్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications