
రంజీ ట్రోఫీ 2022 సీజన్లో బెంగాల్ జట్టు సెమీస్లోనే తమ ప్రయాణాన్ని ముగించే అవకాశం కన్పిస్తోంది. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో బెంగాల్ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 273పరుగులకు చాప చుట్టేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 341పరుగులు చేసిన మధ్యప్రదేశ్‌కు 68 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 197పరుగులు చేసిన బెంగాల్.. మూడో రోజు పెద్దగా రాణించలేకపోయింది. బెంగాల్ సీనియర్ ఆటగాడు, బెంగాల్ క్రీడా మంత్రి మనోజ్ తివారి (211 బంతుల్లో 102పరుగులు 12ఫోర్లు), ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ (209బంతుల్లో 116పరుగులు, 12ఫోర్లు) సెంచరీలతో రాణించినప్పటికీ మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు.
ఫలితంగా 273పరుగులకే బెంగాల్ ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ దీటుగా ఆడుతుంది. గెలుపు దిశగా సాగుతుంది. రజత్ పాటిదార్ (63 నాటౌట్), కెప్టెన్ ఆధిత్య శ్రీవత్సవ (34 నాటౌట్) అత్యంత జాగ్రత్తగా, బాధ్యతగా ఆడుతూ.. భారీ ఆధిక్యం దిశగా మ్యాచ్‌ను నడిపిస్తున్నారు. ఇక మూడో రోజు స్టంప్స్ టైంకు 2వికెట్లు కోల్పోయిన మధ్యప్రదేశ్ 163పరుగులు చేసింది. తద్వారా 231పరుగుల ఓవరాల్ లీడ్ ఆ జట్టుకు దక్కింది. నాలుగో రోజు మధ్యప్రదేశ్ మరో 150 నుంచి 200పరుగులు చేసినా.. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా ఫైనల్‌కు చేరుకునే అవకాశాలుంటాయి.
స్కోర్ సమ్మరీ:
మధ్యప్రదేశ్ ఫస్ట్ ఇన్నింగ్స్ - 341
బెంగాల్ ఫస్ట్ ఇన్నింగ్స్ - 273
మధ్యప్రదేశ్ సెకండ్ ఇన్నింగ్స్ - 2వికెట్ల నష్టానికి 163పరుగులు